డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కు శిక్ష ఖరారు

Views:
7

డిసెంబర్ 31న తాగి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఇవాళ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యాడు.  తన కారుకు డ్రైవర్‌ ఉన్నాడని, కానీ ఆరోజు కొన్ని కారణాల వల్ల రాలేదని ప్రదీప్ మెజిస్ట్రేట్‌కు వివరించాడు. అందువల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో కారు నడపాల్సి వచ్చిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి తప్పు చేయనని యాంకర్ ప్రదీప్ అభ్యర్థించాడు. ప్రదీప్ వాదన విన్న న్యాయస్థానం అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యాంకర్ ప్రదీప్‌కు రూ.2100 జరిమానా విధించింది.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*