ATTACK ON OLD WOMEN

Views:
18

ముసలమ్మపై కాల్పులు.

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు దుండగులు 60 ఏళ్ల నిచేతర్‌ కౌర్‌ అనే వృద్ధురాల్ని తుపాకీతో కాల్చి చంపారు. 2016లో భూవివాదంతో ఆమె భర్తను హత్య చేశారు. ఆమె కుమారుడికి కూడా ఇటీవల కారు ప్రమాదం సృష్టించి హత్యకావించారు. భర్త హత్య కేసులో నిచేతర్‌ కౌర్‌ గురువారం కోర్టుకు హాజరు కావాల్సివుంది. ఆమె ఇంటి సమీపంలో అతిదగ్గర నుంచి దుండగులు కౌర్‌పై కాల్పులు జరిపి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. దుండగులు గుర్తు తెలియకుండా ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*