NAG RAGV’S SHAPATHAM

Views:
13

నాగార్జున వర్మల శపథం.

28 ఏళ్ళ క్రితం వచ్చిన శివ చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన నాగార్జున- వర్మ కాంబినేషన్, ఆ తర్వాత చివరిగా 1992లో వచ్చిన అంతం సినిమా కోసం కలిసి పని చేశారు. ఇక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరిరివురు కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కాప్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం నవంబర్ 20, 2017న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్కి కూడా సిద్ధమైంది. ఇందులో కథానాయికగా అనుష్క, టబు అని పలు పేర్లు వినిపించిన, చివరికి మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని తన సినిమా కోసం సెలక్ట్ చేసినట్టు వర్మ ప్రకటించాడు . ఇక ఈ సినిమాపై అందరిలోను ఎంతో ఉత్కంఠ నెలకొనగా, మూవీకి ఎలాంటి టైటిల్ పెడతాడు, నాగ్ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానులు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే చిత్రానికి శివ2, గన్, సిస్టమ్ లాంటి పలు పేర్లు ప్రచారంలోకి రాగా, తాజాగా శఫథం అనే టైటిల్ కి యూనిట్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. కంపెనీ బేనర్ లో వర్మ నిర్మించనున్న ఈ మూవీలో కింగ్ నాగ్ సిక్స్ ప్యాక్తో కనిపించనున్నాడని తెలుస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కానుందని అంటున్నారు.
Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*