Kondakarla Ava Eco Tourism
-
కొండకర్ల ఆవను పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ 240 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని కాపాడాల్సిన అవసరం ఉంది.
-
గృహ మురుగు నీరు, వ్యవసాయ రసాయనాల వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణ శుద్ధి చర్యలు చేపట్టాలి.
-
స్థానిక మత్స్యకారులను భాగస్వాములుగా చేసుకుంటూ, వలస పక్షుల నివాసాలకు భంగం కలగకుండా సుస్థిర ఈకో-టూరిజం మోడల్ అమలు చేయాలి.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్‌లో తొలి నోటిఫైడ్ కన్జర్వేషన్ రిజర్వ్ అయిన కొండకర్ల ఆవను గ్రీన్ క్లైమేట్‌కు చెందిన రత్నం గారితో కలిసి ఈ ముఖ్యమైన మంచి నీటి సరస్సు యొక్క పర్యావరణ వ్యవస్థ పరిస్థితి అక్కడ పర్యావరణ ఆరోగ్యం, పర్యాటక అవకాశాలను అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన జరిగింది.
కొండకర్ల ఆవ నిస్సందేహంగా భారతదేశంలోనే ఉత్తమమైన ఈకో టూరిజం ప్రాంతాల్లో ఒకటి ఇది అరుదైన పక్షి జాతులతో కూడిన విశిష్ట జీవ వైవిధ్యం గల చిత్తడి నేల. ఈ సరస్సు రాష్ట్రంలోని అత్యంత స్వచ్ఛమైన “సహజ సౌందర్యం” కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిసర గ్రామాల నుంచి వచ్చే గృహ మురుగు నీరు, సమీప వ్యవసాయ భూముల నుంచి వచ్చే రసాయన ఎరువుల ప్రవాహం వల్ల స్వల్ప స్థాయిలో కఅయినా ఇది నివారించాల్సిన కాలుష్య ముప్పు.
ఈ కాలుష్యం సరస్సు యొక్క సున్నితమైన తీపి నీటి సమతుల్యతను దెబ్బ తీయకుండా ఉండాలంటే, తక్షణమే స్థానిక శుద్ధి పరిష్కారాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజలతో కలిసి మీడియా ద్వారా గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవనీయ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని సంప్రదించి, ఈ సహజ సిద్ద చిత్తడి నేల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రణాళికలో భాగంగా సరస్సుపై ఆదారపడి సంప్రదాయ పద్ధతులలో చేపల వేట, కాలువపూల, విస్తర్ల వ్యాపారం చేస్తూ ఉన్న వడ్డీ, యాత, సెట్టి బలిజ వర్గాలకు చెందిన 240 మత్స్యకార కుటుంబాలను అధికారిక పర్యాటక వ్యవస్థలో భాగస్వాములుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం
పర్యావరణానికి అనుకూలమైన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, రసాయనాల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆర్గానిక్ బఫర్ జోన్లను ప్రోత్సహించాలి.
వలస పక్షుల నివాసాలను భంగం కలగకుండా, సుస్థిర పద్ధతుల్లో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరిచే ఈకో-ఫ్రెండ్లీ అభివృద్ధి చేపట్టాలి.
“కొండకర్ల ఆవ రాష్ట్రానికి చెందిన అమూల్య సంపద. శతాబ్దాలుగా ఈ జలాలను కాపాడుతున్న స్థానిక మత్స్యకారులను భాగస్వాములుగా చేసుకుంటే, పరిరక్షణతో పాటు సమృద్ధిని సమతుల్యం చేసే ప్రపంచ స్థాయి ఈకో-టూరిజం మోడల్‌ను సృష్టించవచ్చు” ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరగాలి అని అభిలషిస్తున్నాను
