బండ్ల గణేశ్ ఆరోగ్యంపై నారా లోకేశ్ ఆరా… ఫోన్‌లో పరామర్శ, సంకల్ప యాత్రకు మద్దతు

బండ్ల గణేశ్‌కు కాలి నొప్పి ఎక్కువగా ఉందన్న సమాచారం అందుకున్న నారా లోకేశ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విశ్రాంతి ప్రాధాన్యత గురించి లోకేశ్ వివరించారు.

Nara Lokesh enquiring about Bandla Ganesh health during Tirumala Sankalpa Yatra

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల సంకల్ప యాత్రకు రాజకీయంగా, భావోద్వేగంగా మంచి స్పందన లభిస్తోంది. కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న బండ్ల గణేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

బండ్ల గణేశ్‌కు కాలి నొప్పి ఎక్కువగా ఉందన్న సమాచారం అందుకున్న నారా లోకేశ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విశ్రాంతి ప్రాధాన్యత గురించి లోకేశ్ వివరించారు. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.

మొక్కు వెనుక భావోద్వేగం:

వైసీపీ పాలన సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్

ఆయ‌న‌ క్షేమం కోసం తిరుమల వెంకన్నకు మొక్కుకున్న బండ్ల గణేశ్

చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలై, ఎన్నికల్లో ఘన విజయం

మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో… ఇచ్చిన మొక్కును తీర్చుకుంటున్న బండ్ల‌

ఈ క్ర‌మంలోనే సంకల్ప యాత్ర ప్రారంభించినట్లు గణేశ్ చెప్పారు.

యాత్ర ప్రారంభం: ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ కాలినడకన తిరుమల దిశగా పాదయాత్రను ప్రారంభించారు.

ప్రస్తుతం ఎక్కడంటే:

ప్రస్తుతం ఈ సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. రోజురోజుకు యాత్రకు మద్దతు పెరుగుతోంది. మార్గమధ్యంలో టీడీపీ అభిమానులు, స్థానిక నేతలు బండ్ల గణేశ్‌కు ఘన స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తున్నారు.

తిరుమల దర్శన లక్ష్యం:

కాలినడకన తిరుమలకు బండ్ల గ‌ణేష్‌

శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవడమే తన లక్ష్యమంటున్న బండ్ల గ‌ణేష్‌

బండ్ల గ‌ణేష్‌కి భారీ మ‌ద్ద‌తు

నారా లోకేశ్ పరామర్శతో బండ్ల గణేశ్ యాత్రకు మరింత ఉత్సాహం వచ్చింది. రాజకీయానికి అతీతంగా విశ్వాసం, భక్తి, భావోద్వేగాలతో కొనసాగుతున్న ఈ సంకల్ప యాత్ర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »