సూర్యపేట రెసిడెన్షియల్ హాస్టల్‌లో అర్ధరాత్రి ఘటన… గోడ దూకిన అమ్మాయిల వీడియో వైరల్

సూర్యపేట బీసీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో అర్ధరాత్రి అమ్మాయిలు గోడ దూకిన వీడియో వైరల్ కావడంతో భద్రతపై తీవ్ర చర్చ మొదలైంది.

Suryapet residential hostel girls midnight wall jump CCTV viral video
  • సూర్యపేట హాస్టల్‌లో అర్ధరాత్రి అమ్మాయిల గోడ దూకుడు వీడియో వైరల్
  • సీసీటీవీ ఫుటేజ్‌తో బయటపడిన భద్రతా లోపాలు
  • ప్రభుత్వ వసతి గృహాల భద్రతపై తీవ్ర చర్చ

ప్రభుత్వ వసతి గృహాలలో భద్రత, పర్యవేక్షణపై మరోసారి తీవ్ర చర్చకు దారి తీసే ఘటన సూర్యాపేటలో వెలుగుచూసింది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో అర్ధరాత్రి వేళ ఇద్దరు అమ్మాయిలు గోడ దూకి బయటికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం కలకలం రేపుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Payal Radhakrishna: ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న పాయల్.. హాట్ ఫోటోలు వైరల్

ఘటన వివరాలు

  • రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో ఇద్దరు అమ్మాయిలు హాస్టల్ గోడ దూకారు
  • బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది
  • హాస్టల్ బయట అప్పటికే బైకులతో వేచి ఉన్న ఇద్దరు యువకులతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది
  • తెల్లవారుజామున సుమారు 4:20 – 4:30 గంటల మధ్య డ్రాప్ చేసిన‌ అదే యువకులు అమ్మాయిలను హాస్టల్ ముందు దింపిన దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి
  • అనంతరం ఆ ఇద్దరు అమ్మాయిలు మళ్లీ గోడ దూకి హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది

కీలక ప్రశ్నలు :

ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి వేళ హాస్టల్ నుంచి బయటికి వెళ్లిన వారు నిజంగా విద్యార్థినులేనా? లేక సిబ్బందికి చెందిన వార్డెన్లు లేదా ఇతరులా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

  • రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వారు ఎక్కడికి వెళ్లారు?
  • సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు?
  • హాస్టల్‌లో నైట్ పర్యవేక్షణ వ్యవస్థ సక్రమంగా ఉందా?

భద్రతా వైఫల్యంపై విమర్శలు

ఈ ఘటన బయటపడిన తర్వాత ప్రభుత్వ గురుకుల హాస్టళ్ల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు గోడ దూకి బయటికి వెళ్లగలగడం సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను బయటపెట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడమా?
  • వార్డెన్లు, ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపమా?
  • విద్యార్థుల భద్రతకు సరైన చర్యలు తీసుకుంటున్నారా?

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఆశ్రయిస్తుంటే, ఇలాంటి ఘటనలు భయం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • కొందరు హాస్టల్ సిబ్బంది, ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు
  • మరికొందరు – విద్యార్థుల తప్పుకు సిబ్బంది శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నిస్తున్నారు

అధికారుల స్పందన కీలకం :

ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, విచారణ ఎలా కొనసాగుతుంది అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పూర్తి దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగనున్నాయి. విద్యార్థుల భద్రత, హాస్టల్ నిర్వహణలో పారదర్శకత కోసం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »