ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్: పరీక్షల్లో 6 మార్కులు ఉచితం! ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు కలుస్తాయంటే?

హిందీలో 2, ఇంగ్లీష్‌లో 4 మార్కులు కలపాలని విద్యాశాఖ నిర్ణయం. ఏప్రిల్ 25 తర్వాత ఫలితాల విడుదల అవకాశం!

AP SSC 10th Class Grace Marks Update April 2026
AP SSC 10th Class Grace Marks Update April 2026

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పరీక్షలు రాసిన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తీపి కబురు అందించింది. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించిన బోర్డు, విద్యార్థులకు నష్టం కలగకుండా అదనపు మార్కులు (Grace Marks) కలపాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 6.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు?

ప్రశ్నపత్రాల్లోని సందిగ్ధతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మార్కులను కేటాయించనున్నారు:

  • హిందీ: ప్రశ్నల్లో స్పష్టత లేని కారణంగా 2 మార్కులు.
  • ఇంగ్లీష్: ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పుల కారణంగా 4 మార్కులు.
  • మొత్తం: అదనంగా 6 మార్కులు విద్యార్థుల స్కోరుకు యాడ్ కానున్నాయి.

గమనిక: ఈ అదనపు మార్కులు కేవలం ఆయా ప్రశ్నలను అటెంప్ట్ (Attempt) చేసిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

ఫలితాలు ఎప్పుడంటే?

పదో తరగతి పేపర్ల మూల్యాంకనం (Valuation) ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఏప్రిల్ 15: మూల్యాంకన ప్రక్రియ ముగియనుంది.

ఏప్రిల్ 25 తర్వాత: డేటా ప్రాసెసింగ్ అనంతరం ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది మార్చి 16 నుంచి జరిగిన పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 33,882 మంది టీచర్లు ఇన్విజిలేషన్ విధుల్లో పాల్గొన్నారు.

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకునేందుకు వీలుగా bse.ap.gov.in లింక్‌ను ముందే సిద్ధం చేసుకోండి.
Also Read : మార్చి 14 నుండి SSC పరీక్షలు మొదలు.. ఈసారి కూడా OMR షీట్ అటాచ్డ్ ఆన్సర్ బుక్లెట్ సిస్టమే కొనసాగుతుంది

Telangana SSC Exams : పదో తరగతి పరీక్షలపై వివాదం.. అదే స్కూల్‌లోనే పరీక్ష కేంద్రం

 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »