తెలంగాణ SSC పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం 5.15 లక్షల మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TS SSC Results 2026 రేపు అంటే ఏప్రిల్ 29, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. ఏప్రిల్ 23తో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, అంతకంటే ముందే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
TS SSC Results 2026 – ముఖ్యమైన వివరాలు
| వివరాలు | తేదీ / సమయం |
| పరీక్షలు ప్రారంభం | మార్చి 14, 2026 |
| పరీక్షలు ముగింపు | ఏప్రిల్ 13, 2026 |
| మూల్యాంకనం పూర్తి | ఏప్రిల్ 23, 2026 |
| ఫలితాల విడుదల | ఏప్రిల్ 29, 2026 |
| విడుదల సమయం |
మధ్యాహ్నం 2:00 గంటలు
|
| అధికారిక వెబ్‌సైట్ |
Board of Secondary Education Telangana (bse.telangana.gov.in)
|
Also Read : SSC–ఇంటర్ బోర్డుల విలీనంపై ప్రభుత్వం కసరత్తు

TS SSC Results 2026 ఎలా చెక్ చేయాలి? (Step by Step)
- దశ 1: అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in తెరవండి
- దశ 2: హోమ్‌పేజీలో “TS SSC Results March 2026” లింక్ క్లిక్ చేయండి
- దశ 3: మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
- దశ 4: Submit క్లిక్ చేయండి – subject-wise grades మరియు CGPA కనిపిస్తాయి
- దశ 5: Scorecard download చేసి print తీసుకోండి
గమనిక: ఫలితాల సమయంలో వెబ్‌సైట్ slow గా పని చేయవచ్చు. results.cgg.gov.in కూడా try చేయండి.
వాట్సాప్ ద్వారా TS SSC Results చెక్ చేయండి! (కొత్త ఫీచర్)
ఈ సంవత్సరం నుంచి BSE Telangana కొత్త సౌకర్యం అందిస్తోంది – వాట్సాప్ ద్వారా పదో తరగతి ఫలితాలు తెలుసుకోవచ్చు!
వాట్సాప్ హాల్ టికెట్ download చేసిన వారికి: మీ మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్‌గా మెమో వస్తుంది.
వాట్సాప్ ద్వారా download చేయనివారికి:
- 80969 58096 నంబర్‌కు “Hi” అని message పంపండి
- “SSC Results” అని type చేయండి
- హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి
- ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది
పాస్ మార్కులు ఎంత?
TS SSC Exam 2026 లో పాస్ కావాలంటే ప్రతి subject లో కనీసం 35% మార్కులు సాధించాలి.
వెబ్‌సైట్ ఓపెన్ ఓపెన్ కాకపోతే ఏం చేయాలి?
ఫలితాల సమయంలో లక్షల మంది విద్యార్థులు ఒకేసారి వెబ్‌సైట్ ఓపెన్ చేయటం వల్ల server slow అవుతుంది. అప్పుడు:
- results.bse.telangana.gov.in try చేయండి
- results.cgg.gov.in ఓపెన్ చేయండి
- వాట్సాప్ ద్వారా (80969 58096) చెక్ చేయండి
- కొంత సేపు ఆగి మళ్ళీ try చేయండి
Also Read : పదో తరగతి పరీక్షలు రద్దు కాదు.. గందరగోళానికి చెక్ చెప్పిన విద్యాశాఖ
గత సంవత్సరాల ఫలితాల తేదీలు:
| సంవత్సరం | ఫలితాల తేదీ | పాస్ శాతం |
| 2025 | మే 9 | 85.62% |
| 2024 | మే 13 | 83.18% |
| 2023 | మే 3 | 84.80% |
| 2022 | జూన్ 6 |
99.07% (COVID)
|
2026లో సాధారణ పరిస్థితుల్లో పరీక్షలు జరిగినందున పాస్ శాతం 84-86% మధ్య ఉంటుందని అంచనా.
విద్యార్థులకు సూచనలు
- హాల్ టికెట్ నంబర్ ముందే సిద్ధంగా ఉంచుకోండి
- పుట్టిన తేదీ గుర్తుంచుకోండి
- Scorecard print తీసుకోండి – భవిష్యత్తులో ఉపయోగపడుతుంది
- ఒక్క subject లో fail అయినా Supplementary Exam కోసం సిద్ధంగా ఉండండి
TS SSC Results 2026 కోసం అన్ని అప్‌డేట్‌లు manavarta.com లో వేగంగా తెలుసుకోండి.
Also Read : తెలంగాణ TG TET 2026 — నోటిఫికేషన్, తేదీలు, అర్హతలు పూర్తి వివరాలు


