చంద్రబాబుకు ET అవార్డు – ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ గౌరవం

26వ ఎకనామిక్ టైమ్స్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన చంద్రబాబు. గూగుల్ 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ సహా రూ.10.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నివాళి.

Chandrababu Naidu ET Business Reformer Award 2025
Chandrababu Naidu Wins ET Business Reformer of the Year Award for Rs 10.7 Lakh Crore Investments
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
  • 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ 2025లో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
  • ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ వేదిక, 2024 ఎన్నికల తర్వాత రూ.10.7 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన నేపథ్యంలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ 2025 వేడుకలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు స్వీకరించారు. 2024 ఎన్నికల విజయం తర్వాత రూ.10.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన నేపథ్యంలో ఈ అవార్డు రావడం విశేషం.

అవార్డు స్వీకరించిన చంద్రబాబు మాట్లాడుతూ “ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మా కేబినెట్ మంత్రులకు, అధికారులకు, పాలసీ నిపుణులకు చెందుతుంది” అని వినయంగా అన్నారు. పెట్టుబడులు పెట్టిన పరిశ్రమవేత్తలకు, ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని గుర్తించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పెట్టుబడుల వెల్లువ

2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడుల సాధనలో అభూతపూర్వమైన ఫలితాలు సాధించింది. గూగుల్ విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. డిజిటల్ కనెక్సన్, ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా భారీ ప్రాజెక్టులు ప్రకటించాయి. మొత్తంగా రూ.10.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వ మైలురాయిగా నిలిచింది.

సాంకేతిక వేగంతో అనుమతులు

పెట్టుబడులు ఆకర్షించడంలో ముఖ్యమైన అంశం అనుమతుల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని వేగం పెంచడమని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లో వేగంగా స్పందించే సామర్థ్యం కూడా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Also Read :ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ – ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

76 ఏళ్ల వయసులో దూకుడు

75 ఏళ్లు దాటినా చంద్రబాబు వేగం, విజన్ తగ్గలేదు. రోడ్లు, విద్యుత్ లేని గ్రామంలో పుట్టి భారతదేశానికి తొలి ఐటీ హబ్ నిర్మించిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ అవార్డు ఆ ప్రయత్నానికి జాతీయ స్థాయి గుర్తింపు అని అభిమానులు, పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. ₹60,000 కోట్ల ఆర్సెలార్ మిట్టల్ పెట్టుబడితో ఉత్తరాంధ్ర చరి

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »