హైదరామాద్: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అందరూ బంగారాన్ని ఎంచుకుంటారు, దీనివల్ల ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ధరలు భారీగా పడిపోవడం విశేషం.
అమెరికా డాలర్ విలువ పెరగడం, బాండ్ ఈల్డ్స్ లాభాల్లో ఉండటం , ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు పసిడి వైపు కాకుండా డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 144 డాలర్లు క్షీణించింది.
హైదరాబాద్‌లో నేటి ధరల(23 మార్చి) వివరాలు:
బంగారం ధర: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ. 12,000 వరకు తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1,45,970 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఎటువంటి మార్పు లేకుండా రూ. 1,33,800 పలుకుతోంది.
వెండి ధర: బంగారంతో పాటే వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. గత కొద్ది రోజుల్లో ఏకంగా రూ. 30,000 మేర తగ్గిన కిలో వెండి ధర, ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 2,50,000 మార్క్ వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ ధరలు ఇలా దిగిరావడం కొనుగోలుదారులకు మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: వాటర్ బాటిళ్ల ధరలు పెంపు.. ఎండాకాలంలో సామాన్యులకు డబుల్ షాక్

