Gold Prices : భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి మాత్రం పైపైకే..హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?

హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,50,660కి చేరగా, వెండి ధర మాత్రం భారీగా పెరిగి కిలో రూ.2,60,000 మార్కును తాకింది.

Gold ornaments and silver bricks showing price fluctuations in Hyderabad market on April 7, 2026
Image Credit : Canva

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న కీలక పరిణామాల వల్ల దేశీయంగా బంగారం ధరలు దిగివచ్చాయి.

ఎందుకు తగ్గింది?

ప్రధానంగా అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గి, శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పసిడి అమ్మకాలకు మొగ్గు చూపారు, ఆ ప్రభావం మన హైదరాబాద్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో నేటి ధరలు (ఏప్రిల్ 7, 2026):

24 క్యారెట్ల బంగారం: స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 10 గ్రాములపై (తులం) రూ.270 తగ్గింది. దీంతో నేడు హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ. 1,50,660 వద్ద కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే బంగారం ధర తులంపై రూ. 250 మేర తగ్గింది. దీనివల్ల ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,100 కు చేరింది.

వెండి ధర షాక్:

బంగారం ధరలు తగ్గడంతో సంతోషంలో ఉన్న కొనుగోలుదారులకు వెండి ధర మాత్రం షాక్ ఇచ్చింది. పసిడి బాటలో కాకుండా వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 పెరిగింది. ఈ పెరుగుదలతో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2,60,000 మార్కును తాకింది.

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 15 డాలర్ల మేర తగ్గి 4,660 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం ఆగిపోతుందన్న ఆశలతో మార్కెట్ సానుకూలంగా స్పందించడంతో బంగారం ధరలు తగ్గాయి. అయితే వెండి ధర పెరగడం మాత్రం సామాన్యులకు కొంత భారంగా మారింది.

పైన పేర్కొన్న ధరలు జిల్లాల వారీగా, షాపుల వారీగా స్వల్పంగా మారే అవకాశం ఉంటుంది. కొనుగోలుకు ముందు స్థానిక నగల దుకాణంలో రేట్లు కనుక్కోవడం మంచిది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »