Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో మళ్ళీ పెరిగిన ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే?

హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,63,310కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,700గా ఉంది. వెండి ధర కిలోకు రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.

Today Gold Rate
Today Gold Rate

హైదరాబాద్: పసిడి ప్రియులకు షాకిస్తూ దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, స్థానిక మార్కెట్‌లో మాత్రం పసిడి పరుగు ఆపడం లేదు. ఇరాన్ ఉద్రిక్తతలు , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో బులియన్ మార్కెట్ తీవ్ర అనిశ్చితికి లోనవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుదల.. కానీ!

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ యుద్ధం ముగిసిందన్న వార్తలు, డాలర్ విలువ పుంజుకోవడంతో అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు దాదాపు 76 డాలర్లు తగ్గి, ప్రస్తుతం 5,157 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి కూడా ఔన్సుకు 4.83 శాతం మేర క్షీణించి 85 డాలర్ల స్థాయికి పడిపోయింది.

హైదరాబాద్‌లో నేటి ధరలు (మార్చి 12):

అంతర్జాతీయంగా తగ్గుదల ఉన్నప్పటికీ, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మాత్రం ధరలు భగ్గుమన్నాయి.

24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): 10 గ్రాములపై రూ. 930 పెరిగి, ప్రస్తుతం రూ. 1,63,310 వద్ద ట్రేడవుతోంది.

22 క్యారెట్ల బంగారం (నగల బంగారం): తులంపై రూ. 850 పెరగడంతో, 10 గ్రాముల ధర రూ. 1,49,700 కు చేరింది.

వెండి ధర: వెండి ధరలో ఈరోజు పెద్దగా మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 3,00,000 మార్క్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ధరలు ఎందుకు మారుతున్నాయి?

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు నేరుగా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గినందున, రానున్న రోజుల్లో దేశీయంగా కూడా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఎటు మళ్లుతాయో చెప్పడం కష్టంగా మారిందని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »