హైదరాబాద్: ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు అంతకు మించిన ఊరమాస్ అవతారంలోకి మారిపోయారు. కోలీవుడ్ కమర్షియల్ మాస్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘రాకా’ (RAAKA) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
పోస్టర్ లోని వైల్డ్ లుక్:
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అట్లీ ఈసారి ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని అర్థమవుతోంది.
సగం మనిషి – సగం మృగం: పోస్టర్‌లో అల్లు అర్జున్ సగం గుండుతో, తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు. ఆయన ముఖం సగం తోడెలు చర్మంతో, పదునైన కొమ్ము వంటి గోరుతో కప్పబడి ఉండటం చూస్తుంటే, ఇది మనిషికి మృగానికి మధ్య జరిగే పోరాటమా? లేక ఒక ఫాంటసీ థ్రిల్లరా? అనే ఆసక్తి కలుగుతోంది.
18 ఏళ్ల కల: “రాకా అనేది కేవలం ఒక సినిమా కాదు.. 18 ఏళ్లుగా నా మనసులో ఉన్న ఐడియా” అంటూ అట్లీ చేసిన పోస్ట్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
— atlee (@Atlee_dir) April 8, 2026
అంచనాల అందని కాంబో:
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం, దానికి తోడు ఈ స్థాయి వైల్డ్ పోస్టర్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. “ఏం ప్లాన్ చేస్తున్నావ్ అట్లీ మామ?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ‘పుష్ప’గా అడవిని ఏలిన బన్నీ, ఇప్పుడు ‘రాకా’గా ఎలాంటి విద్వంసం సృష్టిస్తారో చూడాలి.


