అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ .. ఫేక్ ప్రచారానికి స్వీటీ టీమ్ ఘాటు హెచ్చరిక

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి అంటూ వస్తున్న ఊహాగానాలపై ఆమె వ్యక్తిగత బృందం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, వయసుపై వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాకు, నెటిజన్లకు కఠిన

Anushka Shetty marriage rumours

సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి గురించి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుండగా, ఈ వార్తలపై తాజాగా స్వీటీ టీమ్ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చింది.

అనుష్క పెళ్లి గురించి వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమని ఆమె వ్యక్తిగత బృందం స్పష్టం చేసింది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా కేవలం వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం జర్నలిజం కాదని తీవ్రంగా మండిపడింది. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనల్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని హెచ్చరించింది.

వయసుపై వ్యాఖ్యలు చేయోద్దు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుష్క వయసును టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్లపై కూడా ఆమె టీమ్ తీవ్రంగా స్పందించింది. మహిళా నటీమణుల వయసును పదేపదే హైలైట్ చేయడం వివక్షతో కూడిన చర్య అని పేర్కొంది. ఇదే విషయాన్ని పురుష నటుల విషయంలో ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించింది. హీరోలకు ఇచ్చే గౌరవం హీరోయిన్లకు కూడా ఇవ్వాలని సూచించింది.

Also Read: దేవుడి దర్శనంలో కూడా భేదం? డియోగఢ్ ఘటనతో దేశవ్యాప్తంగా VIP దర్శనాలపై ఆగ్రహం

పెళ్లి, నిశ్చితార్థం వంటి అంశాలు పూర్తిగా వ్యక్తిగత విషయాలని అనుష్క టీమ్ స్పష్టం చేసింది. ఇవి క్లిక్స్ కోసం ఉపయోగించుకునే విషయాలు కావని తెలిపింది. ఏదైనా వార్తను ప్రచురించే ముందు అధికారిక ధృవీకరణ తీసుకోవడం మీడియా బాధ్యత అని గుర్తు చేసింది.

ప్రచార స్టంట్స్‌కు దూరంగా అనుష్క

అనుష్క తన కెరీర్‌ను కేవలం ప్రతిభతోనే నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్ లేదా చీప్ పబ్లిసిటీని ఆశ్రయించలేదని టీమ్ వెల్లడించింది. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడమే ఆమెకు ఇష్టమని తెలిపింది. తప్పుడు ప్రచారం ద్వారా వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఇలాంటి చర్యలు శిక్షార్హమని స్పష్టం చేసింది.

కెరీర్‌పై ఫోకస్

ఇక సినిమాల విషయానికి వస్తే, అనుష్క శెట్టి ప్రస్తుతం ‘కథనార్ – ది వైల్డ్ సార్సరర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, అనుష్క పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని ఆమె టీమ్ క్లారిటీ ఇవ్వడంతో, ఇకనైనా ఇలాంటి ఊహాగానాలకు చెక్ పడుతుందా అన్నది చూడాలి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »