టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కొన్ని వారాల క్రితం తనకు కాబోయే జీవిత భాగస్వామి కావ్య రెడ్డిని అభిమానులకు పరిచయం చేసిన ఆయన, ఆ తర్వాత నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు. తాజాగా తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో బుధవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఈ జంట ఒక్కటైంది.
ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.ఈ వివాహ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులుపాల్గొని సందడి చేశారు. ఇక మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
నా అదృష్టం..
పెళ్లికి ముందు మీడియాతో మాట్లాడిన బెల్లంకొండ శ్రీనివాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “శ్రీ వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం. చిన్నప్పటి నుంచి తిరుమలలో జరిగే శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగాను. నా పెళ్లి కూడా అదే పవిత్రక్షేత్రంలో జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని తెలిపారు.
అలాగే తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ “కావ్య అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది. తిరుమలలో పెళ్లి చేసుకోవడం చాలా అరుదైన అవకాశం. అది నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. మా పెళ్లికి ‘శ్రీవాస కావ్యనామ్’ అని పేరు పెట్టాం” అని చెప్పారు.
పలు సినిమాలతో బిజీ..
కావ్య రెడ్డి ప్రముఖ న్యాయవాది కుమార్తె. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినీ రంగంలో కొనసాగుతుండగా, ఈ వివాహంతో ఆయన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. ‘జయ జానకీ నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో కీలకంగా మారాయి. ప్రస్తుతం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న టైసన్ నాయుడుతో పాటు హైందవ సినిమాలతో బిజీగా ఉన్నారు బెల్లంకొండ.
Also read:


