Jabardasth Komurakka Attack: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో జబర్దస్త్ ఫేమ్, నటుడు కొమురక్కపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. అభిమానులమని నమ్మించి ఇంటికి వచ్చిన యువకులు అకస్మాత్తుగా దాడికి పాల్పడటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్ అనే వ్యక్తి ఇటీవల వివాదానికి కారణమయ్యాడు. కొంతకాలం క్రితం కొమురక్క ఇంట్లో బంగారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శ్రీనాథ్‌ను ప్రశ్నించగా, తానే తీసుకున్నట్టు ఒప్పుకుని తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే గడిచిన రోజుల్లో కూడా ఆ బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం కొమురక్క మరోసారి అతనిని గట్టిగా మందలించినట్టు సమాచారం.
ఫొటో దిగే సమయంలో గొడవ(Jabardasth Komurakka Attack)..
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి కొమురక్క ఇంటికి చేరుకున్నాడు. “మేము అభిమానులం.. మీతో ఫోటో దిగాలి” అంటూ నమ్మించాడు. వారిని అభిమానులని భావించిన కొమురక్క ఫోటో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా గొడవ మొదలైంది.
అనూహ్యంగా ఒకరు రాయితో కొమురక్కపై దాడి చేయగా, మరొకరు కర్రతో కొట్టారు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తిపై కూడా రాళ్లతో దాడి చేశారు. దాడి చేసిన వారు “చంపేస్తాం” అంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం.
నిందితులని పట్టుకునే ప్రయత్నం..
ఈ (Jabardasth Komurakka Attack)సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో అభిమానుల పేరిట ఇలాంటి దాడులు జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సెలబ్రిటీల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ₹1.5 కోట్ల ట్యాక్స్ బకాయి: జయలలితా హైదరాబాద్ ఇల్లు సీజ్