హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను నిలబెట్టుకున్న పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచింది. యూత్‌లో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ గురించి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన గాసిప్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరో రోహన్ మెహ్రాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, పూజా హెగ్డే – రోహన్ మెహ్రా మధ్య మొదట స్నేహంగా ప్రారంభమైన పరిచయం, క్రమంగా ప్రేమగా మారిందని చెబుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు, అలాగే ప్రైవేట్ పార్టీలకు కలిసి హాజరవుతున్న సందర్భాలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. పబ్లిక్ ప్లేసుల్లో కూడా పలుమార్లు కలిసి కనిపించడం వల్ల, వీరి మధ్య ఉన్న అనుబంధం స్నేహాన్ని మించి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్క సినిమాలో నటించకపోయిన..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు పూజా హెగ్డే మరియు రోహన్ మెహ్రా కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని సమాచారం. ఆ పరిచయం క్రమంగా బలపడుతూ ప్రేమగా మారి, భవిష్యత్తులో పెళ్లి వరకు వెళ్లే అవకాశముందనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ వార్తలపై ఇప్పటి వరకు పూజా హెగ్డే గానీ, రోహన్ మెహ్రా గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ రూమర్స్‌లో ఎంతవరకు నిజం ఉందన్నది స్పష్టంగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ హాట్‌గా మారింది.
ఒడిదుడుకులు..
కెరీర్ విషయానికి వస్తే, పూజా హెగ్డే తన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, తన స్థానం మాత్రం దృఢంగా నిలబెట్టుకుంటోంది. అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అవకాశాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశంగా మారడం సహజమే. కొంతమంది అభిమానులు ఈ వార్తలను ఆసక్తిగా స్వీకరిస్తుండగా, మరికొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. ఏది ఏమైన, పూజా హెగ్డే పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ప్రేమ వార్తలపై ఆమె స్పందిస్తుందా? లేదా ఇవి కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోతాయా? అన్నది ఆసక్తిగా మారింది.
Also read:


