విజయ్–త్రిష దొరికిపోయారుగా.. విడాకుల వార్తల మధ్య పెళ్లి రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్

తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భార్య సంగీతం విడాకులు కోరిన నేపథ్యంలో ఆయనకు హీరోయిన్ త్రిషతో సంబంధం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒ

Vijay Trisha relationship news

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ వ్యక్తిగత జీవితం ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం మరింత సంచలనంగా మారింది. తన భర్తకు మరో హీరోయిన్‌తో సన్నిహిత సంబంధం ఉందని, అదే కారణంగా విడాకులు కోరుతున్నట్టు సంగీతం పిటిషన్‌లో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే విజయ్‌తో సంబంధం ఉన్న ఆ హీరోయిన్ ఎవరు అనే అంశంపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలా మంది ఈ వార్తలను ప్రముఖ హీరోయిన్ త్రిషతో లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్, త్రిష ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

ఒకే కారులో వ‌చ్చిన త్రిష‌, విజ‌య్

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఇటీవల విజయ్, త్రిష కలిసి పలుమార్లు కనిపించడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా తాజాగా గురువారం జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఈ ఇద్దరూ కలిసి కనిపించడం అభిమానులు, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తమిళ నిర్మాత ఇంట్లో జరిగిన ఆ పెళ్లి వేడుకకు విజయ్–త్రిష ఇద్దరూ హాజరైనట్లు తెలుస్తోంది.

ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నిజమే అయి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. విజయ్ భార్య విడాకులు కోరిన తర్వాతే వీరు బహిరంగంగా కలిసి కనిపించడం కూడా అనేక ఊహాగానాలకు కారణమైంది.

వారిద్ద‌రు స్నేహితులా..

కొంతమంది అభిమానులు మాత్రం ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, విజయ్–త్రిష మంచి స్నేహితులే అని అంటున్నారు. అయితే మరోవైపు కొందరు నెటిజన్లు ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టే అనిపిస్తోందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ విషయంపై విజయ్ గానీ, త్రిష గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, తాజా ఫోటోలు చూసిన తర్వాత త్వరలోనే ఈ ఇద్దరి సంబంధంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మొత్తానికి విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మరిన్ని సినీ వార్తల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని చూడండి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »