హైదరాబాద్ (ఓయూ): మారుతున్న సాంకేతిక ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న 3D ప్రింటింగ్ (Additive Manufacturing) రంగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని CPDDAM విభాగం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్ – 2026’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇంటర్న్‌షిప్ ముఖ్య సమాచారం:
ప్రారంభ తేదీ: మే 11, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: మే 06, 2026
శిక్షణ కాలం: 4 వారాలు
బోధనా పద్ధతి: హైబ్రిడ్ మోడ్ (థియరీ ఆన్‌లైన్‌లో.. డెమోలు ఓయూలో ఆఫ్‌లైన్ ద్వారా).
అర్హతలు (Eligibility):
బీఈ (B.E) / బీటెక్ (B.Tech) / ఎమ్మీ (M.E) చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
బ్రాంచీలు: మెకానికల్, సివిల్, ఈసీఈ (ECE), సీఎస్‌ఈ (CSE), ఎలక్ట్రికల్, మైనింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : హైదరాబాద్‌లో ‘యువ భారత్ రన్’… యువతలో ఫిట్‌నెస్ జోష్
ఇంటర్న్‌షిప్‌లో ఏం నేర్పిస్తారు?
ఈ 4 వారాల శిక్షణలో విద్యార్థులకు అత్యాధునిక అంశాలపై అవగాహన కల్పిస్తారు:
- సాంకేతికతలు: SLA, DLP, FDM, SLM, SLS మరియు PolyJet వర్కింగ్ ప్రిన్సిపల్స్.
- సాఫ్ట్‌వేర్ శిక్షణ: Creo, Ansys, Cura, 3D Slicer మరియు Generative AI CAD Modelling.
- ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్: Artec 3D స్కానర్ వినియోగం, పారిశ్రామిక సందర్శన (NCAM, హైదరాబాద్).
ఫీజు వివరాలు:
- UCE(A), OU విద్యార్థులకు: ₹1,000/-
- ఇతర కళాశాలల విద్యార్థులకు: ₹1,500/-
కీలక తేదీలు:
- దరఖాస్తుకు చివరి తేదీ: మే 06, 2026
- ఎంపికైన వారి జాబితా: మే 08, 2026
- క్లాసులు ప్రారంభం: మే 11, 2026
దరఖాస్తు ప్రక్రియ:
ఆసక్తి గల విద్యార్థులు పోస్టర్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఓడి (HOD) లేదా ప్రిన్సిపాల్ సంతకం చేసిన అప్లికేషన్ మరియు ఫీజు రశీదును జత చేయాల్సి ఉంటుంది. 75% అటెండెన్స్ మరియు చివరి పరీక్షలో 50% మార్కులు సాధించిన వారికి సర్టిఫికేట్ అందజేస్తారు.
పూర్తి వివరాల కోసం : https://www.uceou.edu/
Registration form : https://forms.gle/1Mojay7KDE47LqTS6
సంప్రదించాల్సిన నంబర్లు:
ప్రొఫెసర్ ఎల్. శివరామకృష్ణ (డైరెక్టర్): 9849867046
డాక్టర్ ఇ. మధుసూదన్ రాజు (జాయింట్ డైరెక్టర్): 9701948712
ఇమెయిల్: cpddamsummerinternship2026@gmail.com
Also Read : హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఫిట్‌నెస్ విప్లవం


