హైదరాబాద్: ఆర్థిక సాంస్కృతిక ప్రగతిలో ఆవిష్కరణల పాత్రను గుర్తుచేస్తూ ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో, సంగీతం, విద్య, గేమింగ్ వంటి రంగాల్లో దాదాపు 20 కోట్ల మంది క్రియేటర్లు తమ మేధస్సుతో సరికొత్త కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. అయితే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను కాపీ చేయడం సులభం కావడంతో, అసలు యజమానికి దక్కాల్సిన గుర్తింపు ఆదాయం పక్కదారి పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘బ్లాక్‌చైన్’ సాంకేతికత ముందుకు వస్తోంది.
కనిపించని ఆస్తుల విలువ – పెరిగిన ప్రాధాన్యత 1975లో కంపెనీల మార్కెట్ విలువలో మేధో సంపత్తి (Intangible assets) వాటా కేవలం 17 శాతంగా ఉండేది, కానీ నేడు అది ఏకంగా 90 శాతానికి పెరిగింది. అంటే, భౌతిక ఆస్తుల కంటే ఆలోచనలకే ఎక్కువ విలువ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 కోట్లకు పైగా ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు వస్తున్నాయంటే ఈ రంగం ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ ఫైళ్ల మెటాడేటాను మార్చడం సాధ్యమైనప్పటికీ, బ్లాక్‌చైన్ ద్వారా రూపొందించే ‘ప్రొవెనెన్స్’ (Provenance) రికార్డులను మార్చడం అసాధ్యం. ఇది డిజిటల్ ఆస్తుల విక్రయాల్లో నమ్మకాన్ని పెంచుతుంది.
భారత మార్కెట్ భవిష్యత్తు భారతదేశంలో దాదాపు 80 మిలియన్ల మంది క్రియేటర్లు ఉన్నారు. 2026 నాటికి మన దేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగం రూ. 3,000 కోట్ల నుండి రూ. 3,500 కోట్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఈ భారీ మార్కెట్‌లో కంటెంట్ యాజమాన్యం లైసెన్సింగ్‌పై స్పష్టత ఉండటం చాలా అవసరం. “బ్లాక్‌చైన్ అనేది ఒక శాశ్వతమైన యాజమాన్య వ్యవస్థను అందిస్తుంది. ఇది డిజిటల్ వ్యవస్థల్లో నమ్మకాన్ని బలపరుస్తుంది” అని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా క్రియేటర్లకు రాయల్టీలు వెంటనే అందడం వల్ల పారదర్శకత పెరిగి, క్రియేటర్ ఎకానమీ మరింత బలోపేతం కానుంది.