మేడారం మహాజాతర అనంతరం చెత్త మయం… శుభ్రతకు 6 వేల మంది కార్మికుల యుద్ధప్రయత్నం

Medaram Mahajatara Garbage Cleanup: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాలు 3,000 టన్నుల చెత్తతో నిండిపోయాయి. 6,000 పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను వేరు చేసి, శానిటైజేషన్, బ్లీచింగ్, మెడికల్ సహాయం వంటి చర్యలతో శుభ్రత కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పెద్ద ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Medaram Mahajatara Cleanup Efforts by Sanitation Workers
Medaram Mahajatara Cleanup Efforts by Sanitation Workers

Medaram Mahajatara Garbage Cleanup

  • మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాలు 3,000 టన్నుల చెత్తతో నిండిపోయాయి, ముఖ్యంగా ప్లాస్టిక్, గాజు, జంతు అవశేషాలు.

  • 6,000 పారిశుద్ధ్య కార్మికులు యుద్ధప్రాయ శుభ్రత చర్యల్లో పాల్గొని, వ్యర్థాలను వేరు చేసి, డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.

  • పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్య సమస్యలను నివారించడానికి బ్లీచింగ్, శానిటైజేషన్, సురక్షిత పరికరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయబడాయి.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఘనంగా ముగిసింది. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ ఊర్లకు తిరిగి వెళ్తుండగా, జాతర ముగిసిన వెంటనే మేడారం పరిసర ప్రాంతాలు భారీగా పేరుకుపోయిన చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి, పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది.

మేడారం మాత్రమే కాకుండా కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు వంటి ప్రాంతాల్లో కూడా వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జంతు అవశేషాలు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్గంధంతో నిండిపోయింది. దీంతో ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టి, దాదాపు 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. యుద్ధప్రాతిపదికన శుభ్రతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్మికుల ఆవేదన:

  • పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్న విషయాలు కలచివేస్తున్నాయి
  • రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు
  • కానీ ఇక్కడ జంతువుల తోళ్లు, తలలు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా పడి ఉన్నాయి
  • వాటిని చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయి
  • ఇంత గలీజు పని మేమెప్పుడూ చేయలేదు
  • అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నాం అంటూ కొందరు కన్నీటి పర్యంతమయ్యారు.

చెత్త పరిమాణం – అధికారుల అంచనాలు :

  • అధికారులు వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం:
  • దాదాపు 3 వేల టన్నుల చెత్త మేడారం పరిసరాల్లో పేరుకుపోయింది
  • వ్యర్థాల్లో సుమారు 48% ప్లాస్టిక్, గాజు సీసాలు, బాటిళ్లు
  • దాదాపు 100 టన్నుల ఖాళీ బాటిళ్లు, వాటిలో చాలా పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి
  • మిగిలిన 52% బియ్యం, బెల్లం, ఆహార పదార్థాల అవశేషాలు – ఇవి భూమిలో కలిసిపోయేవి
  • జంతు అవశేషాలు ఎక్కువగా ఉండటంతో దుర్వాసన, ఆరోగ్య సమస్యల ముప్పు

శుభ్రత చర్యలు :

  • ప్రస్తుతం అధికారులు చేపడుతున్న చర్యలు ఇలా ఉన్నాయి:
  • చెత్తను ప్లాస్టిక్ – బయోడిగ్రేడబుల్ – జంతు వ్యర్థాలుగా వేరు చేయడం
  • ప్రత్యేక వాహనాలతో చెత్తను డంపింగ్ యార్డులకు తరలింపు
  • దుర్వాసన నివారణకు బ్లీచింగ్ పౌడర్, శానిటైజేషన్ స్ప్రేలు
  • పారిశుద్ధ్య కార్మికులకు గ్లవ్స్, మాస్కులు, రక్షణ పరికరాల పంపిణీ

ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులు

మేడారం మహాజాతర ఆధ్యాత్మిక వైభవంతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా చర్చను రేకెత్తిస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఇలాంటి వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »