- తెలంగాణ ప్రభుత్వం
- ఇందిరమ్మ ఇళ్లలో RCC స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కీలక మార్పులు
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు అనుమతించిన ప్లాన్‌కు మించి స్లాబ్‌ను విస్తరించడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై RCC స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధిస్తూ జీవో ఆర్.టి. నెం.352 (తేదీ: 27-06-2026) ను జారీ చేసింది.

ప్రభుత్వం ప్రకారం, అనేక మంది లబ్ధిదారులు స్లాబ్‌ను 3 అడుగుల నుంచి 8 అడుగుల వరకు అదనంగా విస్తరించడం వల్ల నిర్మాణ ఖర్చులు పెరిగి, కొందరు అప్పులు చేయాల్సి వస్తోందని నివేదికల్లో వెల్లడైంది.
కొత్త నిబంధనలు ఏమిటి?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్లాబ్ విస్తరణకు ఈ పరిమితులు వర్తిస్తాయి.
ముందు భాగంలో: గరిష్టంగా 3 అడుగుల వరకు మాత్రమే.
మిగతా మూడు వైపులా: ఒక్కో వైపు గరిష్టంగా 1 అడుగు మాత్రమే.
గరిష్ట స్లాబ్ విస్తీర్ణం
ప్రభుత్వం ఉదాహరణలతో స్పష్టత ఇచ్చింది.
- 600 చదరపు అడుగుల ప్లింథ్ ఏరియా ఉన్న ఇంటికి గరిష్ట స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు అడుగులు మించకూడదు.
- 400 చదరపు అడుగుల ప్లింథ్ ఏరియా ఉన్న ఇంటికి గరిష్ట స్లాబ్ విస్తీర్ణం 500 చదరపు అడుగులు మాత్రమే ఉండాలి.
ఎందుకు ఈ నిర్ణయం?
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం:
- నిర్మాణ వ్యయం అనవసరంగా పెరగకుండా చూడడం.
- లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు చేయకుండా నివారించడం.
- ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయంతోనే ఇల్లు పూర్తి చేసేలా ప్రోత్సహించడం.
- పేద కుటుంబాలు మధ్యలో ఇల్లు నిర్మాణాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవడం.
- ప్రత్యామ్నాయ సూచనలు
స్లాబ్‌ను విస్తరించకుండా:
తలుపులు, కిటికీల వద్ద సన్‌షేడ్లు (Chajjas) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇంటి ముందు నీడ కోసం RCC స్లాబ్‌కు బదులుగా GI షీట్ ఆధారిత షెడ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సిఫారసు చేసింది.
ఎవరికి వర్తిస్తాయి?
ఈ మార్గదర్శకాలు భవిష్యత్తులో అమలయ్యే విధంగా (Prospective Effect) ఉంటాయి. ప్రస్తుతం రూఫ్ లెవెల్ (RL), బేస్ లెవెల్ (BL), గ్రౌండింగ్, ఇంకా గ్రౌండింగ్ పూర్తి కాని దశల్లో ఉన్న లబ్ధిదారులకు ఇవి వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నిబంధులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజినీర్లకు సూచనలు జారీ చేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. ముందు భాగంలో స్లాబ్ ఎంత వరకు పొడిగించవచ్చు?
గరిష్టంగా 3 అడుగుల వరకు మాత్రమే.
Q2. మిగతా వైపులా ఎంత వరకు అనుమతి ఉంది?
మిగిలిన మూడు వైపులా ఒక్కో వైపు గరిష్టంగా 1 అడుగు మాత్రమే.
Q3. 600 చదరపు అడుగుల ఇంటికి గరిష్ట స్లాబ్ ఎంత?
750 చదరపు అడుగులు మించకూడదు.


