తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రతి ఏడాది కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా Telangana Liquor Sales Record 2025-26 ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు) రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రూ.40,209 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2024-25లో రూ.37,487 కోట్ల ఆదాయం నమోదవగా, ఈ ఏడాది అదనంగా రూ.2,722 కోట్లు పెరిగాయి. ఇక 2018-19లో ఎక్సైజ్ ఆదాయం రూ.20,859 కోట్లు మాత్రమే ఉండగా, కేవలం ఏడేళ్లలోనే అది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలు…
ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా మద్యం ధరల పెంపు, లైసెన్సు ఫీజుల పెరుగుదల, అలాగే వినియోగం పెరగడం పేర్కొనవచ్చు. ముఖ్యంగా లిక్కర్ అమ్మకాలు స్వల్పంగా పెరగగా, బీర్ల విక్రయాలు మాత్రం గణనీయంగా తగ్గాయి.
2024-25లో 372.25 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవగా, 2025-26లో అది 382.91 లక్షల కేసులకు పెరిగింది. మరోవైపు 2024-25లో 536.13 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, 2025-26లో అది 387.34 లక్షల కేసులకు తగ్గింది.
రెంటల్ ఫీజు ఎంతంటే..
ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల నుంచి రూ.1,771 కోట్ల రెంటల్ ఫీజు వచ్చింది. 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్ల ఆదాయం లభించింది. అదనంగా లిక్కర్ షాపుల లైసెన్సుల దరఖాస్తుల ద్వారా రూ.2,869 కోట్ల ఆదాయం వచ్చింది.
మాసాల వారీగా పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.5,051 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. పండుగలు, వేడుకలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇక అక్టోబర్ నెలలో అత్యల్పంగా రూ.2,709 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ మద్యం అమ్మకాలు:
- ఏప్రిల్: రూ.3,272 కోట్లు
- మే: రూ.3,561 కోట్లు
- జూన్: రూ.3,273 కోట్లు
- జూలై: రూ.3,320 కోట్లు
- ఆగస్టు: రూ.3,082 కోట్లు
- సెప్టెంబర్: రూ.3,048 కోట్లు
- అక్టోబర్: రూ.2,709 కోట్లు
- నవంబర్: రూ.2,868 కోట్లు
- డిసెంబర్: రూ.5,051 కోట్లు
- జనవరి: రూ.3,325 కోట్లు
- ఫిబ్రవరి: రూ.3,208 కోట్లు
- మార్చి: రూ.3,486 కోట్లు
తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతూ ఉండటం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెడుతోంది. Telangana Liquor Sales Record మరోవైపు సామాజిక ప్రభావాలపై కూడా చర్చ కొనసాగుతోంది.


