హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ ఉపాధ్యాయ అభ్యర్థులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. TG TET జూన్-2026 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సోమవారం విడుదల చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని వేలాది టీచర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం కానుంది.
కీలక తేదీలు (Important Dates):
నోటిఫికేషన్ విడుదల: ఏప్రిల్ 13, 2026.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2026.
Visit website : https://schooledu.telangana.gov.in/
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2026 నుండి.
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి జూన్ 30, 2026 వరకు (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT).
ఫలితాల ప్రకటన: జూలై 28 నుండి 31, 2026 మధ్య.
Also Read : ఫీజు రీయింబర్స్‌మెంట్ గందరగోళం.. విద్యార్థులపై భారం పడేలా హైకోర్ట్ తాత్కాలిక నిర్ణయం!
పరీక్ష ఫీజు వివరాలు:
ఈసారి కేటగిరీల వారీగా ఫీజులను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:
జనరల్ మరియు బీసీ అభ్యర్థులు: ఒక పేపర్‌కు ₹750, రెండు పేపర్లకు ₹1000.
ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు: ఒక పేపర్‌కు ₹700, రెండు పేపర్లకు ₹950.
అర్హతలు మరియు వెయిటేజీ:
అర్హత: డీఎల్ఈడీ (D.El.Ed), బీఈడీ (B.Ed) పూర్తి చేసిన వారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెయిటేజీ: ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT/DSC)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
చెల్లుబాటు: టెట్ సర్టిఫికేట్ కాలపరిమితి ఇప్పుడు జీవితకాలం (Lifetime) ఉంటుంది.
క్వాలిఫైయింగ్ మార్కులు:
జనరల్: 60% మార్కులు
బీసీ: 50% మార్కులు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: 40% మార్కులు
Also Read : ఆకలిగా ఉందని అడిగితే శిక్ష! గురుకులంలో షాకింగ్ ఘటన


