టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉదయ భాను గారు. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా అగ్ర స్థానంలో కొనసాగారు. యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆమె యాంకర్ గా పని చేసిన షోలన్ని రికార్డు TRP రేటింగ్ లు సాధించాయి.
ఎంత మంది యాంకర్లు వచ్చిన Udaya bhanu స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఉదయ భాను అంటే ఓ బ్రాండ్. అందంలోనూ అభినయంలోనూ ఆమెను మించిన యాంకర్ లేరు. ఆమె ఒక పవర్ హౌస్. తన మాటలతో ఎన్నో షోస్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన టాలెంటెడ్ యాంకర్. ఈ స్థాయి ఆమెకు ఊరకనే వచ్చింది కాదు. ఆమె ఈ స్థాయి వెనుక ఎంతో కష్టం దాగుంది. చిరంజీవిలా స్వయం కృషితో పైకొచ్చారు. టెలివిజన్ రంగంలో మహారాణిలా నిలిచారు.
తాజాగా ఉదయ భాను గారు తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిశారు. బీసి సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాను తెలంగాణలో బలహీన వర్గానికి చెందిన అణగారిన మహిళల భవిష్యత్తు గురించి ప్రభాకర్ గారితో చర్చించారు.
సినిమా రంగంలో, వ్యాపార రంగంలో మహిళలకు అవకాశాలు కలిపించాలని కోరారు. అంతేగాక వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నపించారు. తన లాగే ఉదయ భాను మహిళలపై చూపిస్తున్న ప్రేమకి, వారికి మంచి చేయాలానే ఆమె ప్రయత్నానికి ప్రభాకర్ గారు ఆకర్షితులయ్యారు. ఉదయ్ భాను ఆలోచనలని, తన అభిప్రాయాలని మెచ్చుకున్నారు. తప్పకుండా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఎంతోమందికి ప్రభుత్వం తరుపున ఇంకా స్వంతంగా ఎన్నో ప్రయోజనాలు అందించిన ఆయన, ఇక నుంచి మరింత అండగా ఉంటానని చెప్పారు. మహిళల పట్ల ఉదయ భానుకున్న ప్రేమపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమెతో చర్చించారు.
ఉదయ భాను గారు ఆయనతో ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడం చాలా అర్థవంతంగా సాగింది. తెలంగాణలో వెనుకబడిన, అణగారిన మహిళల శ్రేయస్సు, సాధికారతపైన వారి చర్చ సాగింది. ముఖ్యంగా తదుపరి తరం మహిళలకు ఆత్మవిశ్వాసంతో, అవకాశాలతో, గౌరవంతో ఎదగడానికి మరింత బలమైన మార్గాలను ఎలా సృష్టించవచ్చో అనే దానిపైన ఉదయ భాను గారు సుధీర్గంగా చర్చించారు.
అంకితభావం, సహనం, సామూహిక కృషి ద్వారా మరింత సమగ్రమైన సమాజాన్ని ఎలా రూపొందించవచ్చో చర్చిస్తూ తన దృక్పథాలను మంత్రి గారితో పంచుకున్నారు.ఈ సంభాషణ ఆలోచనాత్మకంగా, ఉత్పాదకంగా సాగింది.
ఉదయ భాను గారి ప్రయాణాన్ని, సమాజానికి సానుకూలంగా దోహదపడాలనే నిబద్ధతను ప్రభాకర్ గారు బాగా అర్థం చేసుకున్నారు. ఎంతో ఓపికగా, ఓపెన్‌గా ఆమె ప్రణాళికలు విని సమర్థించారు. ఆయన ఓపికకు, అలాగే మహిళల పట్ల ఆయన తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు ఉదయ భాను గారు ఎంతగానో సంతోషించి, ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాకర్ గారి సమయం, ఆప్యాయత, ప్రోత్సాహనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అర్థవంతమైన సంభాషణను, తన ప్రణాళికలను కొనసాగించడానికి ఉదయ భాను గారు మళ్ళీ ప్రభాకర్ గారిని కలవనున్నారు. అణగారిన మహిళల కోసం ముందుకు వచ్చి, వారి సంక్షేమం కోసం ఉదయ భాను చేస్తున్న ప్రయత్నం అభినందనీయంగా మారింది. ఈ ఘటనతో ఉదయ భాను గారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
Also Read: నిర్భయ నిధిలో ములుగు ఎంపిక.. కేంద్రానికి సీతక్క కృతజ్ఞతలు