వరంగల్ రెండో రాజధాని అవుతుందా? మెట్రో, ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలతో విజన్-2047 ప్రణాళికలు సిద్ధం.

వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో విజన్-2047 ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగరాలకు ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అవసరమన

Greater Warangal Road Infrastructure Plan
Greater Warangal Road Infrastructure Plan

వరంగల్ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా విజన్-2047 ప్రణాళికలు తాజాగా సిద్ధమవుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలను హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల తరహాలో త్రినగరాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు 406 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 13 లక్షల పైచిలుకు జనాభా కలిగిన వరంగల్ వచ్చే పదేళ్లలో మెట్రో నగరంగా మారబోతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మహత్తర లక్ష్య సాధనకు ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రద్దీ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అవసరం

గ్రేటర్ వరంగల్ పరిధిలో 2800-2900 చదరపు కిలోమీటర్ల రోడ్డు వ్యవస్థ ఉండగా ప్రధాన రహదారులు 110-130 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎక్స్‌ప్రెస్‌వేలు తక్షణమే అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హనుమకొండలో అదాలత్ సెంటర్, పబ్లిక్ గార్డెన్స్, నయీం నగర్, కేయూ కూడలి, హనుమకొండ చౌరస్తా, అలంకార్-ములుగు రోడ్ వంటి ప్రాంతాల్లో నిత్యం రద్దీ తీవ్రంగా ఉంటోంది. వరంగల్‌లో ఎంజీఎం సెంటర్, బట్టల బజారు, వరంగల్ చౌరస్తా, రైల్వే స్టేషన్, పోచమ్మ మైదాన్ వంటి ప్రాంతాల్లో కూడా రద్దీ సమస్య తీవ్రంగా ఉంది.

విజన్-2047లో ఏమేమి ప్రణాళికలు ఉన్నాయి?

విజన్-2047 పేరుతో వరంగల్, హనుమకొండ నగరాల్లో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్‌కు మాదిరిగా వరంగల్ త్రినగరాల్లో కూడా మెట్రో రైలు, ఎలివేటెడ్ కారిడార్లు, స్మార్ట్ రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాజీపేట వంటి ప్రధాన కూడళ్ల వద్ద తక్షణమే ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ నిర్మించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వరంగల్ మెట్రో నగరంగా మారితే ఏం జరుగుతుంది?

వరంగల్ మెట్రో నగరంగా అభివృద్ధి చేస్తే ఉత్తర తెలంగాణ మొత్తానికి ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. పెట్టుబడులు పెరగడం, ఉద్యోగావకాశాలు విస్తరించడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ మీద ఆధారపడటం తగ్గించి వరంగల్ స్వయం సమృద్ధ నగరంగా ఎదగాలంటే ఈ ప్రణాళికలు సత్వరం అమలు కావాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.

ఇంకా చదవండి: హైదరాబాద్–వైజాగ్ జర్నీ 4 గంటలు తగ్గింపు! ఎలా? ఇక్కడ చదవండి

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »