చరిత్ర సృష్టించనున్న అమరావతి.. తొలిసారిగా రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు

ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు(Amaravati Republic Day) జరగనున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని ప్రత్యేక గ్రౌండ్ సిద్ధం చేసి, శకటాల ప్రదర్శనతో పాటు పరేడ్‌లకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది అమరావతి భవిష్యత్తుకు ఒక కీలక సూచికగా మారనుంది.

Amaravati Hosts Republic Day Celebrations for the First Time
Amaravati Hosts Republic Day Celebrations for the First Time

Amaravati Republic Day

  • ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

  • సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని 22 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక గ్రౌండ్ సిద్ధం చేసి, పరేడ్‌లు, శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • “స్వర్ణ ఆంధ్ర మిషన్ – 2047” లక్ష్యాలను ప్రతిబింబించేలా దాదాపు 30 ప్రభుత్వ శాఖల శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించి దశాబ్దం పూర్తవుతున్నా, ఇంతవరకు ఇక్కడ స్వాతంత్య్ర‌ దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకలు జరగలేదు. గతంలో మౌలిక వసతుల లోపం, రోడ్లు, సరైన గ్రౌండ్ లభ్యత లేకపోవడం, అలాగే భద్రతా పరమైన కారణాల వల్ల ప్రభుత్వాలు ఈ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాయి. అయితే రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. అమరావతిలో అవసరమైన మౌలిక వసతులు చాలా వరకూ సిద్ధమవడంతో, చరిత్రాత్మక నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో ప్రత్యేకంగా ఒక భారీ గ్రౌండ్‌ను సిద్ధం చేయడంతో, రాజధాని వేదికగా మారనుంది.

రిపబ్లిక్ డే (Amaravati Republic Day)కోసం ప్రత్యేక గ్రౌండ్ :

  • అమరావతిలో నూతనంగా అభివృద్ధి చేసిన IAS ప్లాట్లు, ఎమ్మెల్యే అపార్ట్‌మెంట్ల మధ్యలోని ప్రాంతాన్ని ఎంపిక చేశారు
  • సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని, ఏపీ హైకోర్టుకు వెళ్లే మార్గంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్ సిద్ధం
  • గత కొన్ని రోజులుగా మైదానం చదును చేసి, టెంట్లు, పరేడ్ ట్రాక్ ఏర్పాటు
  • జనవరి 26న జరిగే వేడుకలకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులు అందుబాటులోకి

డ్రిల్ రిహార్సల్స్ జోరుగా..

  • ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పోలీసులు, ఎన్‌సీసీ, స్కౌట్స్ బృందాల రిహార్సల్స్
  • పరేడ్ నిర్వహణకు సంబంధించిన పూర్తి డ్రై రన్స్ ఇప్పటికే ప్రారంభం
  • రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వేదిక కూడా సిద్ధం
  • శకటాలే ప్రత్యేక ఆకర్షణ
  • ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో దాదాపు 30 ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొననున్నాయి
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన “స్వర్ణ ఆంధ్ర మిషన్ – 2047” లక్ష్యాలను ప్రతిబింబించేలా శకటాల రూపకల్పన

ప్రధానంగా ప్రతిబింబించనున్న అంశాలు:

  • పేదరిక నిర్మూలన
  • ఉద్యోగ కల్పన & నైపుణ్య అభివృద్ధి
  • నీటి భద్రత
  • అగ్రికల్చర్ & అగ్రిటెక్
  • పారిశ్రామిక అభివృద్ధి
  • విద్య & ఆరోగ్యం
  • ఈ శకటాల తయారీని ఏపీ సమాచార శాఖ పర్యవేక్షిస్తోంది

ఇకపై అన్ని జాతీయ వేడుకలు అమరావతిలోనే :

  • 26.01.26 నుంచి రిపబ్లిక్ డే, ఆగస్టు 15 వేడుకలు శాశ్వతంగా అమరావతిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన
  • ఇన్నాళ్లు ఈ వేడుకలకు వేదికగా ఉన్న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి ఇక ఆ ప్రాధాన్యం తగ్గే అవకాశం
  • రైతుల్లో గర్వం, భద్రత కట్టుదిట్టం
  • రాజధాని అమరావతిలోనే జాతీయ వేడుకలు జరగడం గర్వకారణమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
  • రిపబ్లిక్ డే నేపథ్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచిన పోలీసులు

మొత్తానికి, అమరావతి తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలకు వేదిక కావడం ద్వారా రాజధానిగా తన గుర్తింపును మరింత బలపరుచుకుంటోంది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అమరావతి భవిష్యత్తుకు సూచికగా మారనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే ఎందుకు నిర్వహిస్తున్నారు?

A: మౌలిక వసతులు పూర్తవడం, భద్రతా ఏర్పాట్లు సిద్ధం కావడంతో రాజధాని అమరావతిలోనే జాతీయ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Q2: రిపబ్లిక్ డే వేడుకలు ఎక్కడ జరుగుతాయి?

A: సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో, IAS ప్లాట్లు మరియు ఎమ్మెల్యే అపార్ట్‌మెంట్ల మధ్య ఉన్న 22 ఎకరాల ప్రత్యేక గ్రౌండ్‌లో జరుగుతాయి.

Q3: శకటాల్లో ఏ అంశాలు ప్రతిబింబించనున్నాయి?

A: పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, వ్యవసాయం, నీటి భద్రత, పరిశ్రమలు, విద్య & ఆరోగ్యం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »