మేష రాశి:
ఈరోజు వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలను ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అనుకూల దైవం: శ్రీ నృసింహ స్వామివారు
పూజ: నృసింహ స్వామి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
వృషభ రాశి:
బ్యాంకుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సామాజిక, జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకోవడంతో పాటు విందు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
అనుకూల దైవం: శ్రీ వైభవ లక్ష్మి అమ్మవారు
పూజ: మహాలక్ష్మి హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
మిథున రాశి:
తమకు ఉన్న అనుభవాలను ఉపయోగించుకుని ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. రచనా రంగంలో ఉన్న వారికి అనుకూలతలు, అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది.
అనుకూల దైవం: వాగ్దేవి అమ్మవారు
పూజ: వాగ్దేవి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
కర్కాటక రాశి:
కుటుంబానికి సంబంధించిన దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కుటుంబ పెద్దల ఆశీర్వచనాలు పొందే ప్రయత్నాలు జరుగుతాయి. కుటుంబ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భావోద్వేగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అనుకూల దైవం: శ్రీ భ్రమరాంబికా అమ్మవారు
పూజ: భ్రమరాంబికా అమ్మవారి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి:
ఈరోజు కీలకమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇతరులతో కలిసి చేపట్టే వ్యాపార కార్యక్రమాలు, ప్రయోజనాలను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడతారు. సామాజికంగా గౌరవాలు, ప్రశంసలు అందుతాయి.
అనుకూల దైవం: శ్రీరాముడు
పూజ: శ్రీ రామలక్ష్మ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
కన్య రాశి:
కార్యాలయంలో లేదా ఇతర అంశాలకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైద్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించాలి. సహచరులు వివిధ రూపాల్లో సహకారం అందిస్తారు. కష్టపడి పనిచేస్తారు. ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంది.
అనుకూల దైవం: శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు
పూజ: స్వామివారి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
తుల రాశి:
వివిధ రూపాల్లో కుటుంబ కార్యక్రమాలను చేపడతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉంటుంది. కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది.
అనుకూల దైవం: శ్రీ భువనేశ్వరి అమ్మవారు
పూజ: మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి:
పాత వివాదాల గురించి చర్చించే పరిస్థితులు రావచ్చు. కొంత ఆందోళన కనిపిస్తుంది. పరిశోధనా రంగంలో ఉన్నవారు కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది.
అనుకూల దైవం: శ్రీ సుదర్శన స్వామివారు
పూజ: సుదర్శన అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
ధనుస్సు రాశి:
గౌరవాలు పెరుగుతాయి. దూరదేశాలకు సంబంధించిన చర్చలు సాగుతాయి. కొత్త కార్యక్రమాల గురించి సమయం కోసం వేచి చూస్తారు. నాయకులతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు.
అనుకూల దైవం: శ్రీ దత్తాత్రేయ స్వామివారు
పూజ: దత్త కవచాన్ని పారాయణం చేయడం మంచిది.
మకర రాశి:
ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతమైన పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలాలు పొందుతారు.
అనుకూల దైవం: శ్రీ వెంకటేశ్వర స్వామివారు
పూజ: వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి:
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఆశించిన స్థాయిలో లాభాలు కలిసి వస్తాయి.
అనుకూల దైవం: శ్రీ నారసింహ స్వామివారు
పూజ: నరసింహ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి.
మీన రాశి:
ఈరోజు అనుకూలతలు ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయోజనకరమైన వార్తలు అందుతాయి. కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.
అనుకూల దైవం: శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు
పూజ: విజయలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.


