Today Rasi Phalalu: ఈ రాశులకు ధనలాభాలు.. ఉద్యోగం, వ్యాపారంలో శుభయోగాలు!

Today Rasi Phalalu: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, విద్య, ప్రయాణాలు, పెట్టుబడుల విషయంలో ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

daily horoscope telugu
daily horoscope telugu

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు పోటీతత్వాలతో కూడిన చక్కని విజయాలు లభిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. రాజకీయపరమైన సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తీర్థయాత్రల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

అనుకూలించే దైవం: మహాలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు రైతులకు ఉపయోగపడేటటువంటి పనులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరంగా వివిధ రకాల సహకారాన్ని అందిస్తూ ఉంటారు. స్త్రీలు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

అనుకూలించే దైవం: కాలరాత్రి అమ్మవారు
చేయవలసిన పూజ: దీపలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారు చక్కని ప్రణాళికలతో ఈ రోజు కార్యక్రమాలను చేపడుతుంటారు. సమావేశాల్లో విలువ, గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీకున్నటువంటి మాట విలువ కూడా పెరుగుతుంది. నూతనమైనటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో చేసే కొనుగోలు వ్యవహారాల్లో లాభాలు కలిసి వస్తాయి.

అనుకూలించే దైవం: పద్మాక్షి అమ్మవారు
చేయవలసిన పూజ: పద్మావతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి పలు రకాల వివాదాలకు పరిష్కారాలు కనుగొనగలుగుతారు. అలాగే బంగారం లేదా ఇతరమైనటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసే నిర్ణయాలు తీసుకుంటారు. వివిధ రూపాల్లో మీకు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి.

అనుకూలించే దైవం: కమలాత్మిక అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన నిర్వహించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అధికారిక పరమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. వారికి ఉపయోగపడేటటువంటి పనులు నిర్వహిస్తూ ఉంటారు. నూతన ఆదాయ ప్రణాళికలు ఉపయోగపడుతాయి.

అనుకూలించే దైవం: శ్రీ సిద్ధలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి కవచమును పారాయణం చేయటం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా చేపట్టాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలకు మంచి అనుకూలతలు కలిసి వస్తుంటాయి. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు ఉపయోగపడుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

అనుకూలించే దైవం: వరలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.

తులా రాశి

తులా రాశి వారు కుటుంబపరమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో లాభాలు కలిసి వస్తుంటాయి. సాంస్కృతిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకూలించే దైవం: భవనేశ్వరీ అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు పరిశోధనా రంగంలో మంచి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. ఋణ భారాలను తగ్గించుకోవాలి. అలాగే పోటీతత్వాలతో కూడిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

అనుకూలించే దైవం: సౌభాగ్యలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు విదేశీ ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు లభిస్తూ ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు వింటారు.

అనుకూలించే దైవం: గజలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయాలి.

మకర రాశి

మకర రాశి వారికి భూములు, ఇతరమైనటువంటి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అధికారిక సంబంధమైనటువంటి అనుమతులు లభిస్తూ ఉంటాయి. ప్రభుత్వం ద్వారా విశేషమైనటువంటి అధికార సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి పాత బాకీలను వసూలు చేసుకుంటారు.

అనుకూలించే దైవం: ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆలోచనా విధానాలు కలిసి వస్తుంటాయి. ఇతరులతో ఉన్నటువంటి వ్యాపార బంధాలను కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పెట్టుబడుల విషయాల్లో చిన్న కదలికలు, మార్పులు ఉంటూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారం ఉపయోగపడుతుంది.

అనుకూలించే దైవం: అష్టలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి విశేష అర్చన నిర్వహించండి. చక్కెర పొంగలిని నివేదన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. పొదుపు లక్ష్యాలకు చేరుకోగలుగుతుంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తుంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి లేదా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పాల్గొంటూ ఉంటారు.

అనుకూలించే దైవం: విజయలక్ష్మి అమ్మవారు
చేయవలసిన పూజ: మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి. అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »