ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో 12 రాశుల వారికి వివిధ రంగాల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ రాశికి సంబంధించిన రాశిఫలాలు, అనుకూల దైవం, చేయాల్సిన పూజ వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి వస్త్ర వ్యాపార రంగంలో మంచి ఆలోచనలతో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వివిధ రకాల సమాచారం అందుతుంది. విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
అనుకూల దైవం: హరిద్రా గణపతి స్వామి
పూజ: గణపతి స్వామి కవచాన్ని పారాయణం చేయడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారు వాహన సంబంధిత మరమ్మతుల కోసం ధనాన్ని సమీకరించుకుంటారు. కుటుంబ అవసరాల దృష్ట్యా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అనుకూల దైవం: మనకథ గణపతి స్వామి
పూజ: గణపతి స్వామికి షోడశోపచార పూజ నిర్వహించండి.
మిథున రాశి
మిథున రాశి వారు ప్రేమ, ఆప్యాయతలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా అనుకూలతలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి.
అనుకూల దైవం: ధూమ్ర గణపతి స్వామి
పూజ: గణపతి స్వామికి విభూదితో విశేష అర్చన నిర్వహించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.
అనుకూల దైవం: మయూరేశ్వర గణపతి స్వామి
పూజ: గణపతి స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయండి. పేదలకు అన్నదానం చేయడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సినిమా, కళారంగాల్లో ఉన్నవారికి అవకాశాలు కలిసి వస్తాయి. సంఘపరమైన పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. విందు, వినోదాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకూల దైవం: సిద్ధి వినాయక స్వామి
పూజ: ఎర్రని పుష్పాలతో గణపతి స్వామికి అర్చన చేయండి.
కన్య రాశి
కన్య రాశి వారికి అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందవచ్చు. కుటుంబ పెద్దలతో కీలక విషయాలపై చర్చిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
అనుకూల దైవం: లక్ష్మీ గణపతి స్వామి
పూజ: తామర పుష్పాలతో గణపతి స్వామిని పూజించండి.
తులా రాశి
తులా రాశి వారికి కళాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ఎరుగుపొరుగు వారితో ఉన్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక రంగంలోని వారికి అనుకూలతలు ఉంటాయి. వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.
అనుకూల దైవం: శ్రీ వరద వినాయక స్వామి
పూజ: గణపతి స్వామి పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు విలువైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. మాట విలువతో కీలకమైన పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
అనుకూల దైవం: శ్రీ చింతామణి గణపతి స్వామి
పూజ: గణపతి స్వామిని గరికతో పూజించడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు పలు సభలు, సమావేశాలను నిర్వహిస్తారు. ఇతరులతో ఉన్న వ్యాపార భాగస్వామ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తిపరంగా అనుకూలతలు ఉంటాయి. సామాజిక, జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకూల దైవం: శ్రీ భీమ గణపతి స్వామి
పూజ: వీర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారు వ్యాపార కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. నాయకులతో మనస్పర్థలు పెంచుకోకూడదు. ఇతరులను అనవసరంగా విమర్శించడం, అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.
అనుకూల దైవం: ప్రమోద గణపతి స్వామి
పూజ: గణపతి స్థవరాజ పూజ నిర్వహించుకోవడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితుల సహకారంతో వివిధ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బహుమతులు ఆనందాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలతలు మేలు చేస్తాయి.
అనుకూల దైవం: శ్రీ విరూపాక్ష గణపతి స్వామి
పూజ: గణపతి పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయండి.
మీన రాశి
మీన రాశి వారికి వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటాయి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అవకాశాలను చేజార్చుకోకుండా పట్టుదలతో కార్యక్రమాలను చేపట్టండి.
అనుకూల దైవం: కపిల గణపతి స్వామి
పూజ: గణపతి స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి.
గమనిక: ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణ దినఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.


