నేటి రాశిఫలాలు : ఈరోజు 12 రాశుల వారికి గ్రహస్థితుల ప్రభావంతో వివిధ అంశాల్లో అనుకూలతలు కనిపించనున్నాయి. కొందరికి వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఆర్థిక విషయాల్లో అవకాశాలు లభిస్తే.. మరికొందరు ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శనంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వివిధ రకాల పాతకాలపు వస్తువులను సేకరించే ప్రయత్నాలు చేస్తారు. ఆస్తి వివాదాలు, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.
అనుకూల దైవం: శ్రీ వరద గణపతి స్వామివారు
పూజ: గజానన స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి దగ్గరి వ్యక్తుల అనుకూలత లభిస్తుంది. నమ్మిన వారి పట్ల విధేయత చూపుతారు. శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైన కార్యక్రమాలు అనుకూలిస్తాయి.
అనుకూల దైవం: శ్రీ సిద్ధి వినాయక స్వామివారు
పూజ: ఏకాక్షర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారు వ్యావహారిక విషయాల్లో ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. అరుదైన గ్రంథాలను చదివే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకూల దైవం: శ్రీ క్షిప్ర గణపతి స్వామివారు
పూజ: గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత పొందుతారు.
అనుకూల దైవం: శ్రీ వినాయక స్వామివారు
పూజ: గణపతి గీతను పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దంత సమస్యలతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
అనుకూల దైవం: శ్రీ సిద్ధి వినాయక స్వామివారు
పూజ: కార్యసిద్ధి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
కన్య రాశి
కన్య రాశి వారికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల సహకారంతో కొన్ని కీలకమైన పనులు పూర్తవుతాయి. కష్టపడి పనిచేయడం ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కళాత్మక అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
అనుకూల దైవం: విజయ గణపతి స్వామివారు
పూజ: విద్యా గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారు కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. పితృదేవతల ఆరాధనకు తగిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకుంటారు. యువతకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నిర్వహిస్తున్న వ్యాపారాలు లాభాలను అందిస్తాయి.
అనుకూల దైవం: మోక్ష గణపతి స్వామివారు
పూజ: నారదకృత గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వివిధ రకాల పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కీలకమైన దశకు చేరుకుంటారు. ఉద్యోగస్తులకు పెద్దవారి మార్గదర్శనం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు.
అనుకూల దైవం: శ్రీ ప్రసన్న గణపతి స్వామివారు
పూజ: స్వామివారికి చెరుకు ముక్కను నైవేద్యంగా సమర్పించడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు వ్యక్తిగత వ్యవహారాల్లో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ఉండాలి. పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. వైద్యపరమైన సలహాలు, సూచనలు మేలు చేస్తాయి.
అనుకూల దైవం: శ్రీ ధూమ్రకేత గణపతి స్వామివారు
పూజ: గణపతి నామాష్టకాన్ని పారాయణం చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు కీలకమైన కార్యక్రమాలు ఉంటాయి. వ్యాపారాల కోసం వివిధ రూపాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్ని ఇస్తుంది.
అనుకూల దైవం: శ్రీ బాల గణపతి స్వామివారు
పూజ: బాల గణపతి స్వామివారికి అర్చనలు నిర్వహించి, పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు వివిధ సంస్థలకు అధిపతులుగా ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీర్తి, ప్రతిష్ఠలు, గౌరవాలను జాగ్రత్తగా నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి కార్యక్రమాలను పూర్తి చేయాలి.
అనుకూల దైవం: యోగ గణపతి స్వామివారు
పూజ: గణపతి పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి రవాణా రంగంలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వివిధ ప్రయోజనాలను పొందే ప్రయత్నాలు చేస్తారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందే ప్రయత్నాలు జరుగుతాయి. యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నాలు, పోరాటాలు చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
అనుకూల దైవం: శ్రీ గౌరీ గణపతి స్వామివారు
పూజ: సంఘటన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.


