మే 24 నుండి 30, 2026 వారంలో గ్రహగతులు చాలా రాశులకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవడం, కొత్త ఉద్యోగ అవకాశాలు, శుభకార్య ప్రయత్నాలు ఫలించడం ఈ వారం ప్రధాన అంశాలు. అయితే కొన్ని రాశులు ఖర్చుల విషయంలో, వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మేష రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
వృషభ రాశి
ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులకు అనుకూల వారం. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథున రాశి
అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల పెండింగ్ పనులు పూర్తవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటక రాశి
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. అదృష్టం కలిసివస్తుంది. అయితే అనుకున్న డబ్బు ఆలస్యంగా అందడంతో ప్రత్యేకమైన పనులు వాయిదా పడవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. కాలభైరవాష్టకం పఠించండి.
సింహ రాశి
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులలో ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. కొత్త ఉద్యోగంలో చేరతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.
కన్యా రాశి
కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం, వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
తులా రాశి
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
వృశ్చిక రాశి
న్యాయ సమస్యలు తీరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తోటివారితో మనస్పర్థలు రావచ్చు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి
బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. న్యాయ సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకర రాశి
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కుంభ రాశి
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
మీన రాశి
ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల చదువు, వివాహ శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. గణపతి ఆరాధన శుభప్రదం.


