Gold Prices: షాకిస్తున్న బంగారం ధరలు.. ఉదయం పెరిగి, సాయంత్రం తగ్గుతూ.. అంతుచిక్కని పసిడి గమనం!

హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1,50,660కి చేరగా, వెండి ధర మాత్రం కిలోకు రూ.5,000 తగ్గి రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

Gold and Silver Prices
Gold and Silver Prices

హైదరాబాద్: బంగారం కొనాలనుకునే వారికి ప్రస్తుతం ధరల తీరు ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఉదయం ధర పెరిగితే సాయంత్రానికి తగ్గడం.. మళ్ళీ మరుసటి రోజు ఊహించని విధంగా పుంజుకోవడం వంటి పరిణామాలతో మార్కెట్ దోబూచులాడుతోంది. గత రెండు రోజులుగా ఇదే అనిశ్చితి కొనసాగుతుండగా, ఇవాళ (ఏప్రిల్ 30) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.

నేటి మార్కెట్ ధరలు (10 గ్రాములకు):

  • హైదరాబాద్ మార్కెట్‌లో నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
  • 24 క్యారట్ల బంగారం: రూ. 220 పెరిగి రూ. 1,50,660 కి చేరింది.
  • 22 క్యారట్ల బంగారం: రూ. 200 పెరిగి రూ. 1,38,100 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర: కిలో వెండి ధర రూ. 5,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,60,000 వద్ద ఉంది.

ధరల హెచ్చుతగ్గులకు అసలు కారణాలేంటి?

పసిడి ధరల్లో కనిపిస్తున్న ఈ అస్థిరతకు ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు, ఇది మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపుతోంది.

దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 4,552 డాలర్లు, వెండి 71.96 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక మన దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX) లో కూడా గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుండటంతో స్థానిక మార్కెట్లలో ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఏప్రిల్ 30, ఉదయం 10 గంటల సమయం వరకు అందిన సమాచారం ప్రకారం మాత్రమే . మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.
Also read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »