వెండి ₹5,000 పడిపోయింది – ఇప్పుడు కొనడమే సరైన సమయం!

Gold and Silver Prices: శుభకార్యాల వేళ శుభవార్త.. భారీగా పడిపోయిన వెండి ధర.. బంగారం కూడా నిలకడ!

Today Gold Price
Today Gold Price

హైదరాబాద్: ఇవాళ బంగారం, వెండి కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ మిశ్రమ వార్తలను అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడటమే కాకుండా, వెండి ధరలో అనూహ్యమైన తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా భాగ్యనగరంలో ప్రస్తుల ధరల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

స్థిరంగా పసిడి ధరలు:

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ పసిడి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. నిన్నటి ధరలే కొనసాగుతుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,55,290

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,42,350

వెండి ధరలో భారీ పతనం:

బంగారం నిలకడగా ఉంటే, వెండి మాత్రం కొనుగోలుదారులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 మేర ధర తగ్గడం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు కిలో వెండి రూ. 2,75,000 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు , పారిశ్రామికంగా డిమాండ్ తగ్గడమే ఈ భారీ పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొనుగోలుదారులకు మంచి అవకాశం:

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వెండి వస్తువులు, పట్టీలు లేదా దేవుడి వెండి సామాగ్రి కొనాలనుకునే సామాన్యులకు ఇది అద్భుతమైన సమయం. ఒకేసారి రూ. 5,000 తగ్గడం వల్ల సామాన్యుల జేబుపై భారం గణనీయంగా తగ్గుతుంది.

ఆభరణాల కొనుగోలులో జాగ్రత్తలు:

ధరలు తగ్గుముఖం పట్టిన తరుణంలో ఆభరణాలు కొనేవారు కొన్ని విషయాలను తప్పనిసరిగా గమనించాలి.

మీరు కొనే నగపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ముద్ర ఉందో లేదో సరిచూసుకోండి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం, కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

పైన పేర్కొన్నవి ఈరోజు ఉదయం 10 గంటల వరకు నమోదైన ధరలు. వీటికి అదనంగా జీఎస్‌టీ (GST), తయారీ ఛార్జీలు (Making Charges) వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.

Also Read : Gold and Silver Rates: బంగారం ధరలో ఊహించని బాంబు.. కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పసిడి ధరలు!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »