జపాన్‌లో ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న అక్కడి అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ జపనీస్ అభిమాని అనర్గళంగా తెలుగులో మాట్లాడి అల్లు అర్జున్, రష్మిక మందన్నలను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
జపాన్‌కు చెందిన కజు అనే అభిమాని ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్, రష్మికను కలిశాడు. తొలుత జపనీస్‌లో మాట్లాడిన కజు, ఆ తర్వాత ఒక్కసారిగా తెలుగులో పలకరించడంతో ఇద్దరూ అవాక్కయ్యారు. తెలుగు సినిమాలపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, నటనను ప్రశంసించిన తీరు అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఈ క్షణాలను కజు వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి.కజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్, రష్మికతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ, “భారతదేశంలోని ఇద్దరు అగ్ర నటీనటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దక్కింది. ఊహించని తెలుగు సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఈ అద్భుతమైన అనుభవానికి కృతజ్ఞుడను” అని రాసుకొచ్చాడు. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగులో మాట్లాడిన మరో వీడియోను కూడా షేర్ చేశాడు.
Also, Read: స్పోర్టీ నుంచి గ్లామర్ వరకు: యషిక ఆనంద్ హాట్ అండ్ స్టైలిష్ ఫోటోషూట్
కజు మాటలు అదరహో..
- సంభాషణలో కజు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
- మీరు తెలుగు సినిమాలకు గర్వకారణం
- నేను తెలుగు నేర్చుకుంటున్నాను. దయచేసి నా తెలుగును భరించండి అని చెప్పిన కజు
- నవ్వుతూ సమాధానం ఇచ్చిన అల్లు అర్జున్, రష్మిక
- అతని తెలుగు విని చప్పట్లు కొట్ట్టిన రష్మిక
- నువ్వు ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలి అంటూ జోక్ చేసిన అల్లు అర్జున్
కజు ఇంకా తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాష చాలా అందమైనదని, భారతదేశాన్ని సందర్శించాలనే కోరిక ఉందని చెప్పాడు. ఇది తన మొదటిసారి తెలుగులో మాట్లాడటమేనని చెప్పినప్పుడు, రష్మిక “నీ తెలుగు అద్భుతంగా ఉంది” అంటూ ప్రశంసించింది. ఈ వీడియోపై నటి చంద్రిక రవి కూడా “చాలా బాగుంది” అంటూ చప్పట్ల ఎమోజీలతో కామెంట్ పెట్టింది.
టీంకి గ్రాండ్ వెల్‌కమ్
- ‘పుష్ప 2’ జపాన్ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్, రష్మికకు ఘన స్వాగతం
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, ఫొటోలు
- తెలుగు భాష, సినిమాలపై జపాన్ అభిమాని ప్రశంసలు
- అభిమానులతో సరదాగా స్పందించిన అల్లు అర్జున్, రష్మిక
ఇక కెరీర్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. మరోవైపు రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తర్వాత ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.
View this post on Instagram