అల్లు అర్జున్ ‘రాకా’తో భారీ ఎంట్రీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నించే హీరోగా పేరుపొందాడు. ఇప్పుడు ఆయన తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రివీల్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.
అయితే టైటిల్ ప్రకటించిన వెంటనే ‘రాకా’ అనే పదానికి అర్థం ఏమిటి? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘రాకా’ అనే పేరు ‘రాక్షసుడు’ అనే భావనకు దగ్గరగా ఉండేలా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సినిమాలోని ప్రధాన పాత్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు.
డ్యూయల్ రోలం్
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందులో ఒక పాత్ర పూర్తి నెగెటివ్ షేడ్స్‌తో, సగం మనిషి – సగం మృగ లక్షణాలతో కూడిన వింత జీవిగా ఉండబోతుందని సమాచారం. ఈ క్రూరమైన పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:మావోయిస్టులే గురువులు.. బస్తర్ పోలీసుల సరికొత్త వ్యూహం వైరల్!
మరోవైపు రెండో పాత్ర మాత్రం అల్లు అర్జున్ స్టైలిష్ అవతార్‌లో, ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందట. ఈ రెండు విభిన్న పాత్రల మధ్య కాంట్రాస్ట్ సినిమా కథలో కీలకంగా మారనుంది. అందుకే ఈ చిత్రానికి ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఎలా మెప్పిస్తాడు
ఈ ప్రయోగాత్మక పాత్రపై బన్నీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపించిన భయంకరమైన అవతార్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. అల్లు అర్జున్ తన నటనతో ఈ విభిన్నమైన పాత్రను ఏ స్థాయిలో పండిస్తారో అని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘రాకా’ ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో వచ్చిన కొన్ని సినిమాల గెటప్‌లను ఈ లుక్ తలపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
ఆ మూడు సినిమాలతో పోలుస్తూ
ప్రత్యేకంగా విక్రమ్ నటించిన ఐ సినిమాలో కనిపించిన గెటప్‌తో పోల్చుతూ, ఈ లుక్ అదే తరహాలో ఉందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే కార్తీ నటించిన కాష్మోరా చిత్రంలోని విలన్ లుక్‌ను కూడా గుర్తు చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. “అక్కడి లుక్‌ను ఇక్కడ రిపీట్ చేశారా?” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో విలన్ పేరు ‘రాకా’ కావడం కూడా చర్చకు దారితీసింది. టైటిల్‌తో పాటు కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచే ప్రేరణ పొందిందా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు “మెర్సల్ + కాష్మోరా మిక్స్‌లా ఉంది” అంటూ రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో చర్చలు నడుస్తున్నాయి. అయితే, అభిమానులు మాత్రం ఇది కేవలం ఫస్ట్ లుక్ మాత్రమేనని, అసలు సినిమా విడుదలైతేనే పూర్తి క్లారిటీ వస్తుందని కౌంటర్ ఇస్తున్నారు.


