జ్వ‌రంలోనూ స్టెప్స్ ఆపని చిరు–చ‌ర‌ణ్… తండ్రీ–కొడుకుల డాన్స్ డెడికేషన్ వైరల్

‘పెద్ది’లో జ్వ‌రంతోనూ రామ్ చరణ్ సింగిల్ టేక్ డాన్స్. గతంలో 104 జ్వ‌రంలో చిరు ‘ధినక్కుతా’ షూట్ చేసిన సంఘటన గుర్తు.

Rai Rai Raa Raa From Peddi

తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. అదే గ్రేస్, అదే ఎనర్జీ ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ చరణ్‌లో కూడా కనిపిస్తోంది. ఇద్దరిలోనూ కనిపించే ముఖ్యమైన కామన్ పాయింట్ – డాన్స్ పట్ల ఉన్న అపారమైన ప్యాషన్, కట్టుబాటు.

డాన్స్ మాస్టర్ “1..2..3” అని కౌంట్ ఇవ్వగానే ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం వెల్లువలా ఉబికి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కెమెరా ముందుకు వచ్చేసరికి పూర్తి ఎనర్జీతో స్టెప్స్ వేయడం ఈ తండ్రీ–కొడుకుల ప్రత్యేకత.

‘పెద్ది’లో చరణ్ సింగిల్ టేక్ మ్యాజిక్

తాజాగా ‘పెద్ది’ చిత్రంలోని “రై.. రై రారా..” పాటలో రామ్ చరణ్ వేసిన సింగిల్ టేక్ డాన్స్ మూమెంట్ సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ దక్కించుకుంది. ఆ ఒక్క మూమెంట్‌లో చరణ్ గ్రేస్, ఎనర్జీ మరో లెవల్‌లో కనిపించాయి.

అయితే ఆ షూట్ సమయంలో చరణ్ ఆరోగ్యం బాగోలేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ ఆగకూడదనే ఉద్దేశంతో తన శక్తినంతా ధారబోసి ఆ స్టెప్ పూర్తి చేశారని సమాచారం. సింగిల్ టేక్‌లో ఆ షాట్ పూర్తి చేసి యూనిట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Also Read: తుమ్మన్‌పేటలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన విజయ్-రష్మిక .. నాన్‌వెజ్ భోజ‌నాలు పెట్ట‌డంతో నెటిజ‌న్స్ ఆగ్ర‌హం

చిరు జ్వ‌రంలోనూ ‘ధినక్కుతా’

ఇలాంటి సంఘటనే కొన్నేళ్ల క్రితం మెగాస్టార్ జీవితంలోనూ చోటుచేసుకుంది. ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ చిత్రంలోని “ధినక్కుతా..” పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం. ఆ రోజు దాటితే శ్రీదేవి డేట్లు అందుబాటులో ఉండవు. సినిమా విడుదల తేదీ కూడా ఫిక్స్ అయింది.

సినిమా ఆగకూడదనే బాధ్యతతో చిరు జ్వరంలోనూ కెమెరా ముందుకు వచ్చారు. ఆశ్చర్యకరంగా, ఆ జ్వరంలోనూ ఆయన గ్రేస్, స్టైల్ ఒక్క శాతం కూడా తగ్గలేదు. ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. నేటికీ ఆ స్టెప్స్ అభిమానులు గుర్తుచేసుకుంటారు.

తండ్రీ–కొడుకుల్లో ఒకే డెడికేషన్

ఇప్పుడు అదే సీన్ చరణ్ విషయంలో రిపీట్ అయినట్టే కనిపిస్తోంది. డాన్స్ విషయంలో ఇద్దరిలోనూ కనిపించే కమిట్‌మెంట్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. గ్రేస్ విషయంలో చిరును బీట్ చేసే వారు లేరని అభిమానులు చెబుతారు. కానీ ఆ స్థాయిని అందుకునే దిశగా చరణ్ ప్రయాణం సాగుతున్నదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

సినిమా కోసం త్యాగం

చిరు, చరణ్ మాత్రమే కాదు. సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు సినిమా కోసం, అభిమానులను అలరించడానికి, నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఎన్నో సార్లు ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడతారు. కెమెరా వెనుక జరిగే ఈ త్యాగాలు ప్రేక్షకులకు కనిపించకపోయినా, ఫలితంగా వచ్చే వినోదం మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

తెలుగు సినిమాల్లో డాన్స్ ఒక ప్రధాన ఆకర్షణ. చిరంజీవి కాలంలో ప్రారంభమైన డాన్స్ రివల్యూషన్‌ను రామ్ చరణ్ తన తరానికి తీసుకెళ్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు. జ్వ‌రంలోనూ స్టెప్స్ వేయడం ఒక హీరో కమిట్‌మెంట్‌కు నిదర్శనం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

తండ్రీ–కొడుకుల ఈ డెడికేషన్ అభిమానుల్లో మరింత గర్వాన్ని కలిగిస్తోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »