Devi Putrudu : దేవీపుత్రుడు: 25 ఏళ్ల ‘ద్వారక’ మిస్టరీ.. అప్పట్లో టాలీవుడ్ బాహుబలి, కానీ బాక్సాఫీస్ దగ్గర ఎందుకు బోల్తా పడింది?

Devi Putrudu : టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ అండర్ రేటెడ్ గ్రాఫిక్స్ వండర్ 'దేవీపుత్రుడు'. 25 ఏళ్ల క్రితమే ద్వారక రహస్యాలను వెండితెరపై ఆవిష్కరించిన విక్టరీ వెంకటేష్. అన్నీ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు వెనుకబడింది? 90s కిడ్స్ స్వీట్ మెమరీస్ గురించి ప్రత్యేక విశ్లేషణ...

Venkatesh in underwater sequence from Devi Putrudu movie set in Dwarka
Venkatesh in underwater sequence from Devi Putrudu movie set in Dwarka

ఫ్లాప్ అని ముద్ర పడినా, కోట్ల మంది హృదయాల్లో ‘విక్టరీ’ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది కచ్చితంగా విక్టరీ వెంకటేష్ నటించిన ‘దేవీపుత్రుడు’. 2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, అప్పటికి టాలీవుడ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ (₹14 కోట్లు) సినిమా. నేటికి పాతిక ఏళ్లు కావస్తున్నా, ఈ సినిమా ఇచ్చే అనుభూతి మాత్రం వెరీ స్పెషల్.

ఆ అంచనాలు.. ఆ క్రేజ్!

అప్పట్లో విక్టరీ వెంకటేష్ వరుస హిట్లతో భీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. దానికి తోడు ‘శతృవు’ వంటి హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ – ఎం.ఎస్. రాజు కాంబినేషన్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నైజాం ఏరియాలోనే ఈ సినిమా ₹5 కోట్లకు అమ్ముడుపోవడం అప్పట్లో ఒక సంచలనం. మణిశర్మ అందించిన సంగీతం రిలీజ్‌కు ముందే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

అద్భుతమైన విజువల్స్.. హాంట్ చేసే మ్యూజిక్

ఈ సినిమా నేటికీ ఎందుకు గుర్తుంటుందంటే:

  • ద్వారక విజువల్స్: సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని అప్పట్లోనే గ్రాఫిక్స్‌లో చూపించిన తీరు అమోఘం.
  • ఆ పవర్ ఫుల్ బాక్స్: సినిమా అంతా ఒక పవర్ ఫుల్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్లేవి.
  • మణిశర్మ మ్యాజిక్: “కృష్ణుడు ఏలిన ద్వారక” పాట వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాగే “ఓ ప్రేమ ప్రణయవీణ” మెలోడీ ఇప్పటికీ ఎందరికో ఫేవరెట్.

గుజరాత్ భూకంపం – ఒక విచిత్రమైన కోయిన్సిడెన్స్:

సినిమా విడుదలైన సరిగ్గా 10 రోజులకు (జనవరి 26, 2001) గుజరాత్‌లో భారీ భూకంపం సంభవించింది. సినిమాలో కూడా ప్రకృతి వైపరీత్యాలు, భూకంపం వంటి అంశాలు ఉండటం, ద్వారక నేపథ్యం ఉండటంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా పుణ్యమా అని చాలా మందికి గుజరాత్‌లోని ద్వారక గురించి, అక్కడి రహస్యాల గురించి తెలిసింది.

ఆగిపోయిన ‘అంజనీపుత్రుడు’:

దేవీపుత్రుడు(Devi Putrudu)గనుక హిట్ అయి ఉంటే, ఎం.ఎస్. రాజు గారు వెంకటేష్‌తోనే ₹25 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘అంజనీపుత్రుడు’ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా పరాజయంతో ఆ ప్రాజెక్ట్ ఆలోచనలు కాస్తా కనుమరుగయ్యాయి. లేదంటే వెంకటేష్ కెరీర్ గ్రాఫ్ మరో రేంజ్‌లో ఉండేది.

దేవీపుత్రుడు కేవలం సినిమా కాదు, అదొక విజువల్ వండర్. ఈరోజు చూసినా ఎక్కడా బోర్ కొట్టదు. కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకు ‘కల్ట్ క్లాసిక్’ హోదా దక్కింది. హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ అయితే ఎంత బాధగా ఉంటుందో చెప్పడానికి ‘దేవీపుత్రుడు’ ఒక ఉదాహరణ.

Also Read: అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్.. 10 ప్రత్యేక రైళ్లు, 10 లక్షల జనం! ఎన్టీఆర్ ‘ఆంధ్రవాలా’ సృష్టించిన ప్రభంజనం ఇదే!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »