హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) 2026 అవార్డుల్లో టాలీవుడ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వివిధ భాషల చిత్రాలను గౌరవించే ఈ ప్రతిష్టాత్మక వేదికపై తెలుగు సినిమాలు మరియు నటీనటులు ప్రధాన అవార్డులను కైవసం చేసుకున్నారు.
తెలుగు విభాగం విజేతలు:
ఉత్తమ నటుడు: నాగచైతన్య (తండేల్) – మత్స్యకారుడి పాత్రలో ప్రాణప్రతిష్ట చేసిన చైతన్యకు ఈ అవార్డు దక్కింది.
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం: మిరాయ్ (హీరో తేజ సజ్జా) – ఈ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు గెలుచుకుంది.
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ హాస్యనటుడు: మాస్టర్ రేవంత్ / బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రామ్ జగదీష్ (కోర్ట్)
విశేషం: ఇప్పటికే తెలంగాణ ‘గద్దర్ అవార్డ్స్’లో ఉత్తమ నటీనటులుగా నిలిచిన నాగచైతన్య, రష్మికలు.. ఇప్పుడు INCAలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడం విశేషం.
Also Read : “ఫ్లవర్ కాదు ఫైర్” డైలాగ్ ముందుగా నేనే చెప్పా .. దానిని సుకుమార్ వాడుకున్నారన్న మంచు లక్ష్మి
ఇతర భాషల విజేతలు:
కన్నడ: రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్ 1) – ఉత్తమ నటుడు, దర్శకుడు మరియు ఉత్తమ చిత్రం.
తమిళం: దుల్కర్ సల్మాన్ (ఉత్తమ నటుడు), సిమ్రాన్ (ఉత్తమ నటి).
హిందీ: రణవీర్ సింగ్ (ఉత్తమ నటుడు), యామీ గౌతమ్ (ఉత్తమ నటి).
మలయాళం: నివిన్ పౌలీ (ఉత్తమ నటుడు).
Also Read : విడుదల రోజే సేఫ్ జోన్‌లోకి ‘విష్ణు విన్యాసం’ – థియేటర్లలో పాజిటివ్ టాక్ హిట్!
ముంబైలో తారల సందడి:
ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఏప్రిల్ 16న ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది.
హోస్ట్‌లు: టాలీవుడ్ రానా దగ్గుబాటి మరియు బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్.
అతిథులు: సీనియర్ నటి రేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితర సినీ దిగ్గజాలు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Also Read : సినీ రంగంలో తెల్లతోలు వ్యామోహం… సమీరా రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు


