రామ్ చ‌ర‌ణ్ బర్త్‌డే బ్లాస్ట్ .. ‘పెద్ది పహిల్వాన్’గా మెగా ప‌వ‌ర్ స్టార్ మాస్ విస్ఫోటనం

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్: 'పెద్ది' గ్లింప్స్‌లో పహిల్వాన్‌గా మెగా పవర్ స్టార్ మాస్ విస్ఫోటనం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రగ్డ్ లుక్‌తో అదరగొట్టిన గ్లోబల్ స్టార్.

Ram Charan Peddi Glimpse
Ram Charan Peddi Glimpse

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పెద్ది’ పహిల్వాన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కుస్తీ యోధుడిగా చరణ్ రగ్డ్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ టీజ‌ర్‌తో ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు చ‌రణ్‌.

మెగా ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్ర బృందం హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ వీడియోలో చరణ్ మాస్, రగ్డ్ అవతార్‌లో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు.

పెద్ది పహిల్వాన్ గ్లింప్స్‌తో అంచ‌నాలు పీక్స్‌లో..

ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’తో ఆ అంచనాలను మరింత పెంచింది. కుస్తీ పోటీదారుడిగా కండలు తిరిగిన దేహంతో, ప‌వ‌ర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో చరణ్ కనిపించిన తీరు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

కుస్తీ అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా… ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్, చరణ్ కుస్తీ శిక్షణ, యాక్షన్ సన్నివేశాలతో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. చివర్లో “చూడమ్మీ ఆటే నా పొగరు” అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ వీడియోకు హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్ చూసిన నెటిజన్లు సిల్వర్ స్క్రీన్‌పై హనుమంతుడిని చూస్తున్నామా?” అంటూ కామెంట్లు చేస్తూ ఫిదా అవుతున్నారు. చరణ్ లుక్, ఎనర్జీ, యాక్షన్ అన్నీ కలిసి ఈ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

పెద్ది టీజ‌ర్ మేనియా…

ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రయ్ రయ్ రా రా’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మిలియన్ల వ్యూస్ సాధించాయి. అభిమానులు ఆ పాటల స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ గ్లింప్స్ రావడంతో ‘పెద్ది’ టీజర్ మేనియా మరింత ఊపందుకుంది.

ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మొదట ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తుండగా, ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Also read: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »