టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు నిర్మాణ రంగంలోనూ బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆమె, తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో తెరకెక్కుతున్న డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే మంచి హైప్ సొంతం చేసుకుంది.
వరుస ప్రమోషన్స్..
గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ దూకుడుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచాయి.
Also Read:హెచ్ఐవీపై అపోహలు వద్దు.. అవగాహనే ఆయుధం: కేబుల్ బ్రిడ్జిపై మానవ హారంలో మంత్రి దామోదర రాజనర్సింహ!
ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో ‘డెకాయిట్’ టీమ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ముఖ్యంగా నిర్మాత సుప్రియను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
“డియర్ సుప్రియ… డెకాయిట్ కోసం నువ్వు పెట్టిన కష్టం, నీ పట్టుదల, సినిమాపై నీ అంకితభావం అన్నీ నేను స్వయంగా చూశాను. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడానికి నువ్వు అర్హురాలు. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలి” అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
నెటిజన్ల ప్రశంసలు..
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి చెందిన ప్రాజెక్ట్‌కు సమంత మద్దతు ఇవ్వడం మరోసారి చర్చకు దారి తీసింది.
ఇక సినిమా విషయానికొస్తే, ‘డెకాయిట్’ ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రిలీజ్‌కు ముందు మంచి బజ్ సొంతం చేసుకున్న ‘డెకాయిట్’ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాల్సి ఉంది. (Samantha Supports Dacoit Movie) సమంత చేసిన ఈ చిన్న పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తూ, సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చిందని చెప్పాలి.


