టాలీవుడ్ సెన్సేషనల్ జోడీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ కపుల్ రిలేషన్‌షిప్‌పై అఫీషియల్ స్టాంప్ పడబోతోంది. గీత గోవిందంలో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు ఆఫ్-స్క్రీన్ కూడా ఒక్కటి కావడానికి ఉదయ్‌పూర్ వెన్యూగా డెస్టినేషన్ వెడ్డింగ్ సాక్ష్యం కాబోతోంది. రాజస్థాన్‌లోని రాయల్ సిటీ ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని సమాచారం.
ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలను ప్లాన్ చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ జంట ఉదయ్‌పూర్‌ను ఎంచుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ వివాహ వేడుకను అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పెళ్లి జరిగే వేదిక వద్దకు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తెలుస్తోంది.
అతిథుల కోసం కొన్ని కఠినమైన నిబంధనలు కూడా విధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈవెంట్ ఫోటోలు బయటకు రాకుండా ఉండేందుకు నో-ఫోన్ పాలసీని అమలు చేస్తున్నారట. గోప్యత విషయంలో ఈ జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసినప్పటి నుంచే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఆఫ్ స్క్రీన్ కూడా వీరు కలిసున్న ఫోటోలు చూసి త్వరలోనే గుడ్ న్యూస్ వింటామని ఫ్యాన్స్ఆశపడ్డారు. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చిందని అది కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌తో నిజం కాబోతోందని అందరూ హ్యాపీగా ఉన్నారు. పెళ్లి తర్వాత అయినా ఈ జంట తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారేమోనని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ జంటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ పెళ్లి వార్త గ్లోబల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈ ఏడాదికి ఇదే అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ అని చెప్పొచ్చు.