ఉదయ్‌పూర్‌లో ఘనంగా వివాహం జరిగిన తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. కో సముయి ద్వీపంలో వీరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.
ఇప్పుడీ కొత్త జంట తమ హనీమూన్‌ను ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం కో సముయి ద్వీపంలో వీరు సేదతీరుతున్నట్లు సమాచారం. తాజాగా బయటకు వచ్చిన ఓ ఫోటోలో పచ్చని ప్రకృతి మధ్య ఈ జంట ఎంతో ఏకాంతంగా, ప్రశాంతంగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. సముద్రతీరానికి సమీపంలో ఉన్న ఈ అందమైన ప్రదేశంలో వీరిద్దరూ ఒకరితో ఒకరు సమయం గడుపుతూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్ నిజ జీవితంలో కూడా జంటగా మారి, ఇలా హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తుండటం చూసి వారు సంబరపడిపోతున్నారు. ‘విరోష్’ జంట అంటూ అభిమానులు ఈ జంటపై ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ జంట సినీ ప్రయాణం విషయానికి వస్తే, గీత గోవిందం చిత్రం ద్వారా వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమాలోని వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు, వీరి జంటకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది. షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైందని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ప్రేమ పెళ్లి..
అనంతరం డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఈ జంట కలిసి నటించింది. ఈ చిత్రం సమయంలోనే వీరి బంధం మరింత బలపడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట, చివరికి వివాహంతో తమ ప్రేమకు ముద్ర వేసింది.
మొత్తంగా, వివాహం తర్వాత హనీమూన్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలు విరోష్ జంటపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ప్రస్తుతం రణబాలి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అతి త్వరలోనే మూవీ విడుదలకి ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.
Also Read: ట్రోలర్లపై రష్మిక మందన్న ఘాటు హెచ్చరిక

