త‌మ బంధాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విజ‌య్-ర‌ష్మిక‌.. పెళ్లికి ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరు

టాలీవుడ్ క్రేజీ జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంధాన తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు పెట్టిన ‘విరోష్’ పేరునే పెళ్లి వేడుకకు టైటిల్‌గా ఖరారు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding
Vijay Deverakonda Rashmika Mandanna Wedding

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. తమ బంధాన్ని సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు వివాహ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోష్’ పేరునే తమ పెళ్లి వేడుకకు టైటిల్‌గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకే విధమైన పోస్ట్ చేస్తూ, “మీరు మాకు పెట్టిన పేరే మా వివాహానికి పేరు. మమ్మల్ని ఇంత ప్రేమతో ఆదరించినందుకు ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు. అయితే పెళ్లి తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

హిట్ జోడీగా గుర్తింపు

విజయ్ – రష్మిక కలిసి ‘గీతా గోవిందం ’, ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించి సూపర్ హిట్ జోడీగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘రణబాలి’ అనే చిత్రంలో కూడా కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ పంచుకునే పోస్టులు, ఒకరి పట్ల మరొకరు చూపించే అనుబంధం ఆ రూమర్స్‌కు బలం చేకూర్చాయి. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగినట్లు కూడా టాక్ వినిపించింది.

ఎక్కడ, ఎప్పుడు?

సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26న ఉద‌య్‌పూర్‌ లోని ఓ రాజభవనంలో సింపుల్‌గా వివాహ వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మార్చి 4న హైద‌రాబాద్‌లోని తాజ్ కృష్ణ‌లో సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.

వీరిద్దరి వివాహ ప్రకటనతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలా ప్రేమ కథగా మొదలైన ఈ అనుబంధం, ఇప్పుడు వివాహ బంధంగా మారబోతుండటంతో టాలీవుడ్‌లో ఇది మరో గ్రాండ్ సెలబ్రేషన్‌గా మారనుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »