తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2BHK (డబుల్ బెడ్రూమ్) హౌసింగ్ కాలనీల్లోని ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాల (Commercial Shops) విక్రయానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. “ఉన్నది ఉన్నట్లుగా” (As is where is condition) ప్రాతిపదికన బహిరంగ వేలం ద్వారా ఈ షాపులను కేటాయించనున్నారు.
వేలం నిర్వహణ వివరాలు:
ఈ వేలం ప్రక్రియ రెండు రోజుల పాటు సంబంధిత ఆర్డీఓ (RDO) కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 15, 2026: బండ్లగూడ, జంగమ్మెట్, ఫరూక్ నగర్, ధూల్‌పేట, కుల్సుంపురా ప్రాంతాల్లోని షాపులకు వేలం. (వేలం వేదిక: RDO ఆఫీస్, హైదరాబాద్).
ఏప్రిల్ 16, 2026: కమలానగర్, చిలకలగూడ, ఎల్బీ నగర్, ముషీరాబాద్, బాకారం ప్రాంతాల్లోని షాపులకు వేలం. (వేలం వేదిక: RDO ఆఫీస్, సికింద్రాబాద్).
ధర మరియు డిపాజిట్ (EMD):
అప్సెట్ ప్రైస్ (కనీస ధర): ప్రాంతాన్ని బట్టి చదరపు అడుగుకు (Sft) రూ. 5,000 నుండి రూ. 20,000 వరకు నిర్ణయించారు.
డిపాజిట్ (EMD): వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 30,000 మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో “District Collector, Hyderabad District” పేరు మీద సమర్పించాల్సి ఉంటుంది. ఈ డీడీని వేలం రోజున ఉదయం 9:30 నుండి 11:00 గంటల లోపు అందజేయాలి.
Also Read : కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కోర్ అర్బన్ రీజియన్‌లో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
షాపుల వివరాలు :
| ప్రాంతం | షాపుల సంఖ్య | వైశాల్యం (Sq.ft) | కనీస ధర (Sft కి) |
| కమలానగర్ | 15 | 180 – 244 | రూ. 20,000/- |
| బండ్లగూడ | 7 | 182 – 240 | రూ. 8,000/- |
| చిలకలగూడ, ఎల్బీ నగర్ | 17 | 66 – 130 | రూ. 7,000/- |
| ధూల్‌పేట, కుల్సుంపురా | 16 | 80 – 188 | రూ. 5,000/- |
వ్యాపారస్తులు ఏవైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
PD హౌసింగ్ ఆఫీస్: 6304638734 / 8712032705
RDO హైదరాబాద్: 9063423936
RDO సికింద్రాబాద్: 9063423937
