ఆధార్ కార్డ్‌ని రీడిజైన్ చేసే ఆలోచ‌న‌.. ప‌ర్స‌న‌ల్ డిటైల్స్ అన్ని ఇక భ‌ద్రం.. కొత్త ఎం-ఆధార్ యాప్‌తో భద్రత మరింత బలంగా..

ఆధార్ వివరాల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం-ఆధార్ యాప్‌లో యూజర్లు ఇప్పుడు తమ బయోమెట్రిక్ సమాచారాన్ని సులభంగా లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే సౌకర్యం పొందుతున్నారు. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు. అలానే యూఐడీఏఐ ఆధార్ కార్డ్‌ని రీ డిజైన్ చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం.

New Aadhaar card redesign

కేంద్ర ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఎం-ఆధార్ (mAadhaar) యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆధార్‌కు సంబంధించిన అనేక ఆన్‌లైన్ సేవలను ఒకేచోట అందించడమే కాకుండా, యూజర్లకు తమ వ్యక్తిగత వివరాలపై పూర్తి నియంత్రణ కల్పించేలా ఈ యాప్ రూపొందించారు. ముఖ్యంగా ఆధార్ బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే ఆప్షన్ యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది.

ఆధార్‌ను సురక్షితంగా ఉంచేందుకు Unique Identification Authority of India (యూఐడీఏఐ) ప్రత్యేకంగా ఈ లాక్/అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తోంది. యూజర్ ఆధార్‌ను లాక్ చేసినప్పుడు, ఆ ఆధార్ నెంబర్‌తో జరిగే ధృవీకరణ ప్రక్రియలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. దీనివల్ల ఇతరులు మీ ఆధార్ వివరాలను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ఇది ఎంతో ఉపయోగకరం.

ఆధార్ లాక్ చేయడం వల్ల ప్రయోజనాలు :

  • బయోమెట్రిక్ వివరాలు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు
  • ఇతర సేవల కోసం ఆధార్ నెంబర్ ఉపయోగించకుండా నిలిపివేయవచ్చు
  • యూజర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది
  • అవసరమైనప్పుడు మళ్లీ అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది
  • ఎం-ఆధార్ యాప్ ద్వారా లాక్/అన్‌లాక్ చేసే విధానం
  • ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • ఆధార్‌కు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
  • యాప్‌లో “Services” విభాగంలోకి వెళ్లి “Lock/Unlock Aadhaar” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • “Lock Aadhaar”పై క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి.
  • ధృవీకరణ కోసం వచ్చే ఓటీపీని నమోదు చేసిన వెంటనే ఆధార్ లాక్ అవుతుంది.
  • అవసరమైనప్పుడు ఇదే విధంగా “Unlock Aadhaar” ఆప్షన్ ద్వారా తిరిగి అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఈ విధానం ద్వారా యూజర్లు తమ ఆధార్ సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో ఈ ఫీచర్ ప్రతి ఆధార్ వినియోగదారుడికి ఉపయోగపడే కీలక భద్రతా సాధనంగా నిలుస్తోంది.

మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే ఆధార్‌ని త‌ర్వ‌లో రీ డిజైన్ చేసే ఆలోచ‌న‌లో యూఐడీఐఏ ఉంద‌ట‌. ఈ రీడిజైన్‌లో కేవ‌లం ఫొటో క్యూఆర్ కోడ్ మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. ప‌ర్స‌న‌ల్ డీటైల్స్ అన్నీ క‌నిపించ‌కుండా దీనిని మాడిఫై చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »