Sheetal Devi Temple: శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళా భక్తుల మృతి

Sheetal Devi Temple: బిహార్‌లోని నలంద జిల్లాలో శీతల్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భక్తుల రద్దీ, భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని సమాచారం.

Police and medical teams at Sheetal Devi Temple in Nalanda following a tragic stampede incident
Sheetal Devi Temple Accident

Sheetal Devi Temple: న‌లంద‌ జిల్లాలోని శీతల్ దేవి ఆలయంలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. దీప్ న‌గ‌ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘడా గ్రామంలో ఉన్న ఆలయంలో భారీగా భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగి కనీసం 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు పాట్నాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Sheetal Devi Temple Accident

ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రతి మంగళవారం లాగే ఈరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు ఆలయాని(Sheetal Devi Temple)కి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తోపులాట చోటుచేసుకుని, అది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మోహ‌రించిన పోలీసు బ‌ల‌గాలు..

ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. సుమారు 12 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం ఆలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

ఈ ఘటనపై నితిష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ ద్వారా రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు చొప్పున, మొత్తం రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

అశ్ర‌ద్ధ వ‌లనేనా?

ఇక ఇదే రోజున న‌లంద యూనివ‌ర్సిటీలో కన్వొకేషన్ కార్యక్రమం జరగనుండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి ద్రౌప‌ది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం వల్ల ఆలయంలో నిర్లక్ష్యం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టగా, అసలు కారణాలపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Also read: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మ‌రింత తీవ్రం .. ఖార్గ్ దీవిపై అమెరికా ఆధిపత్యం, క‌ల‌వ‌ర‌ప‌డుతున్న ప్ర‌పంచ దేశాలు

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »