టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా ప్రస్తుతం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు అభిమానుల అంచనాలను నిలబెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం టీమిండియా తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
మొదటగా మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ మే 31 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొంటారు. ఐపీఎల్ ముగిసిన తరువాతే భారత జట్టు అంతర్జాతీయ సిరీస్‌లకు సిద్ధమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ పర్యటన..
జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు జరుగుతాయి. టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరగనుంది. అనంతరం జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Also Read: ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్ రూ. 5వేల కన్నా ఎక్కువ తగ్గింపు
ఇంగ్లాండ్ పర్యటన
జూలై నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ టూర్‌లో మొదట ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత జూలై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ మైదానాల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.
శ్రీలంక పర్యటనకు భారత్
ఆగస్టు నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ టూర్‌లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ టెస్ట్ క్రికెట్ అభిమానులకు మంచి ఆసక్తి రేపనుంది.
ఆ తరువాత సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. ఈ క్రీడల్లో కూడా క్రికెట్ పోటీలు ఉండనున్నాయి. ఆ తరువాత భారత జట్టు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. అనంతరం వెస్టిండీస్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది.
న్యూజిలాండ్ పర్యటన
అక్టోబర్ – నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి.
బిజీ బిజీ షెడ్యూల్..
ఇక డిసెంబర్ నెలలో శ్రీలంక జట్టు మరోసారి భారత్ పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తంగా చూస్తే టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం టీమిండియా ముందున్న ఏడాది అంతా బిజీ షెడ్యూల్‌తో ఉండనుంది. ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో భారత జట్టు ఈ సిరీస్‌లలో మైదానంలోకి దిగనుంది.