274 మిలియన్ ఫాలోవర్లు ఉన్న విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా మాయం అయింది
అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందా? టెక్నికల్ ఇష్యూ లేదా సస్పెన్షన్ అనే అనుమానాలు
అధికారిక స్పందన లేకపోవడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సుమారు 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. శుక్రవారం ఉదయం నుంచి విరాట్ కోహ్లీ అధికారిక ప్రొఫైల్ (@virat.kohli) ను సెర్చ్ చేసినా, ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా అది అందుబాటులో లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ ఖాతాను యాక్సెస్ చేయాలని ప్రయత్నించిన వారికి “This page isn’t available”, “The link may be broken” అనే ఎర్రర్ మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందా? లేక సస్పెండ్ అయ్యిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇది ఇలా ఉండగా, ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. క్రికెట్ పరంగా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా పరిణామం చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది.
- అయితే, ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది.
- విరాట్ కోహ్లీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా మాత్రం యథావిధిగా యాక్టివ్‌లోనే ఉంది.
- అక్కడ ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
- కోహ్లీ నుంచి అధికారిక క్లారిటీ రాకపోవడంతో అభిమానుల దృష్టి ఆయన భార్య, నటి అనుష్క శర్మ సోషల్ మీడియా ఖాతాలపై పడింది.
“విరాట్ కోహ్లీకి ఏమైంది?”
“ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు కనిపించడం లేదు?” అంటూ ఆమె తాజా పోస్టుల కింద వేల సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. అయితే, ఈ విషయంలో అనుష్క శర్మ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందించింది లేదు.
నెట్టింట వైరల్ అవుతున్న ఊహాగానాలు : అధికారిక ప్రకటన లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ..
- ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపమా?
- లేక విరాట్ కోహ్లీనే స్వయంగా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ఇచ్చారా?
- లేదా అకౌంట్‌పై ఏదైనా పాలసీ సంబంధిత సస్పెన్షన్ జరిగిందా?
అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న “నిహలిస్ట్ పెంగ్విన్” మీమ్‌తో పోలుస్తూ, కోహ్లీ డిజిటల్ ప్రపంచం నుంచి కొద్దికాలం దూరంగా ఉండాలనుకున్నాడేమో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ప్రాముఖ్యత :
- ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా విరాట్ కోహ్లీకి గుర్తింపు ఉంది
- కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ బ్రాండ్‌గా సోషల్ మీడియాలో భారీ ప్రభావం ఉంది
- ఫ్యాన్స్‌తో పాటు బ్రాండ్స్, స్పోర్ట్స్ ప్రపంచం కూడా ఆయన అకౌంట్‌పై ఆధారపడుతుంది
- అలాంటి స్టార్ అకౌంట్ ఒక్కసారిగా మాయం కావడం స్పోర్ట్స్ – సోషల్ మీడియా ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది.
ప్రస్తుతం అభిమానులంతా విరాట్ కోహ్లీ ఎక్స్ ఖాతా నుంచి గానీ, అనుష్క శర్మ నుంచి గానీ ఏదైనా అధికారిక అప్‌డేట్ వస్తుందేమోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే వరకు సోషల్ మీడియాలో కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.