ఇండియన్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు, 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్‌సీబీ ఓపెనర్లుగా కోహ్లీ, జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవర్‌లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఐపీఎల్‌లో 800 ఫోర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఫోర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
కోహ్లీ సరికొత్త రికార్డ్..
ఇక సిక్సర్ల విషయంలో కూడా కోహ్లీ వెనుకడుగు వేయలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తన 300వ సిక్సర్ బాదుతూ ఐపీఎల్‌లో ఈ మార్క్ చేరుకున్న మూడో బ్యాటర్‌గా, రెండో భారతీయుడిగా నిలిచాడు. క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఈ జాబితాలో ముందున్నారు. అయితే ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆర్‌సీబీని గెలుపు దిశగా నడిపించాడు. 37 ఏళ్ల వయస్సులో కూడా అతని ఆటలో ఏ మాత్రం తగ్గుదల కనిపించలేదు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు.
మంచి భాగస్వామ్యం..
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 205/3 పరుగులు చేసింది. కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఆర్సీబీ మంచి విజయం సాధించింది.
మొత్తానికి చిన్నస్వామి స్టేడియం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ సీజన్‌లో కోహ్లీ ఫామ్ చూస్తుంటే మరిన్ని రికార్డులు అతని ఖాతాలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:


